Begin typing your search above and press return to search.
వీడియో టాక్: తెలంగాణ ఐటెం బాంబ్
By: Tupaki Desk | 10 Oct 2015 11:33 AM ISTగానా.. గానా.. తెలంగాణా.. అంటూ ఐటెం బాంబ్ గా మారిపోయింది రెడ్ హాట్ బ్యూటి ఛార్మి కౌర్. ప్రస్తుతం అమ్మడి చేతిలో జ్యోతిలక్ష్మి సినిమా తరువాత ఒక్క సినిమా కూడా లేదు. ఆ సినిమా ఫట్టనడంతో ఇటు మనీతో పాటు అటు క్రేజ్ కూడా కాస్త దెబ్బతినేసింది. అందుకేనేమో ఇప్పుడు సడన్ గా ఈ తెలంగాణ ఐటెం బాంబ్ అవతారం ఎత్తేసింది అమ్మడు.
అప్పట్లో తమిళంలో విక్రమ్ సినిమాలో ఒక ఐటెం నెంబర్ చేస్తున్నా అంటూ షూటింగ్ స్పాట్ నుండి తెగ ట్వీట్లేసింది ఛార్మి. గుర్తుందా? ప్రముఖ సినిమాటోగ్రాఫర్ విజయ్ మిల్టన్ దర్శకత్వం వహిస్తున్న ''10 ఎన్రాదుకుళ్ళ'' సినిమాల్లో అమ్మడు విక్రమ్ సరసన ఈ ఐటెం నెంబర్ చేస్తోంది. యథావిథిగా తన ఒంపుసొంపులను బాగానే వడ్డించేసిందిలే. ఏ మాత్రం మొహమాట పడకుండా అందాలను ఆరబోసింది. అయితే ఈ పాటను చూడ్డానికి ఎంత హాట్ గా ఉందో.. వింటే కూడా.. అలాగే ఉంది.. ముఖ్యంగా గానా గానా తెలంగాణ అంటుంటే.. అసలు తమిళ సినిమాలో ఈ కొత్త రాష్ట్రం ప్రస్తావనతో ఒక పాట పెట్టేశారేంటబ్బా అనే సందేహం వచ్చేస్తోంది.
ఇకపోతే '10 ఎన్రాదుకుళ్ళ'' సినిమాలో విక్రమ్ - సమంత జంటగా నటిస్తున్నారు. ఇదొక రోడ్ ట్రావెల్ లో సాగే యాక్షన్ స్టోరి. ఇప్పటికే ట్రైలర్ కు విపరీతమైన క్రేజ్ వచ్చేసింది. అక్టోబర్ 21న తమిళ వర్షెన్ రిలీజ్ అవుతున్నట్లు తెలుస్తోంది కాని.. తెలుగులో మాత్రం చేస్తోందీ లేనిదీ ఇంకా తెలియదు.