Begin typing your search above and press return to search.

ఒకసారి తిన్నావ్‌ గా ఛార్మి. సరిపోలే??

By:  Tupaki Desk   |   7 Oct 2015 10:00 PM IST
ఒకసారి తిన్నావ్‌ గా ఛార్మి. సరిపోలే??
X
నిజానికి రేవతి ఓ నటీమణి గానే అందరికీ తెలుసు. కానీ ఈవిడ డైరెక్టర్ కూడా. అది కూడా ఏదో సాదాసీదా సినిమాలు కాదు.. ఏకంగా సల్మాన్ ఖాన్ - అభిషేక్ బచ్చన్ - శిల్పాశెట్టిల కాంబినేషన్ లో ఫిర్ మిలేంగే అని ఓ మూవీ చేసింది హిందీలో. అది దారుణంగా ఫెయిలైంది లెండి. దీనికి ముందు మిత్ర్ మై ఫ్రెండ్ అనే మూవీకి నేషనల్ అవార్డ్ కూడా గెలుచుకున్న ఘనత రేవతిది. తర్వాత కూడా 3-4 ప్రయత్నాలు చేసినా.. డైరెక్టర్ గా సెటిల్ కాలేకపోయింది. ఇప్పుడీమె తాను రాసిన ఓ స్క్రిప్ట్ ని పూరికి వినిపించడం ఆయన సై అనడం అయిపోయాయట. ఇదంతా తెలిసిందే. అయితే ఈ సినిమా నిర్మాత విషయంలోనే ఎక్కడో తేడా కొట్టేస్తోంది.

ఇంతకీ ఈ మూవీకి ప్రొడ్యూసర్ ఎవరో తెలుసా? జ్యోతిలక్ష్మి తో నిర్మాత అవతారమెత్తిన ఛార్మియే.. రేవతి చెప్పిన స్టోరీకి ప్రొడ్యూసర్ అని తెలుస్తోంది. అంతా ఫైనల్ అయితే.. రాజ్ తరుణ్ ని హీరోగా తీసుకోవాలని అనుకుంటున్నారట. అసలు మ్యాటర్‌ ఏంటంటే.. ప్రస్తుతం టాలీవుడ్‌ లో ఛార్మి పరిస్థితి ఏమీ బాగాలేదు. అది అందరికీ తెలిసిందే. మరి అమ్మడు తన సినిమా కెరియర్ ను చూసుకోకుండా ఇలా ప్రొడక్షన్‌ అంటూ ఏమి ఉద్దరిస్తుందో అర్ధంకాని పరిస్థితి. పైగా జ్యోతిలక్ష్మి ఫ్లాపు తరువాత ఛార్మి చేతిలో ఒక్క సినిమా కూడా లేదు. యాక్టింగ్‌ ఛాన్సులపై ఫోకస్‌ చేయకుండా.. ఇప్పుడు సడన్‌ గా ఈ నిర్మాత అవతారం ఎందుకు ఛార్మి? ఒకసారి తిన్నావ్‌ గా స్ట్రోక్‌.. సరిపోలే??