Begin typing your search above and press return to search.
బర్త్ డే స్పెషల్: వైరల్ అవుతున్న ఛార్మి క్యూట్ పిక్..!
By: Tupaki Desk | 17 May 2021 11:00 PM ISTటాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ ఛార్మి అంటే తెలియని వారుండరు. ఎందుకంటే తెలుగులో కెరీర్ ప్రారంభించిన ఈ భామ పదిహేనేళ్ల వయసులోనే హీరోయిన్ అయింది. 2002లో నీతోడు కావాలి అనే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన ఛార్మి.. అదే ఏడాది హిందీ - తమిళ - మలయాళం ఇండస్ట్రీలలో కూడా అరంగేట్రం చేసింది. అనంతరం 2004లో శ్రీఆంజనేయం సినిమాతో పూర్తి స్థాయిలో ప్రేక్షకులకు దగ్గరైంది. ఆ తర్వాత మాస్ - గౌరి - రాఖీ - అనుకోకుండా ఒకరోజు - లక్ష్మి - మంత్ర - పౌర్ణమి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ఇండస్ట్రీలో మంచి క్రేజ్ అయితే తెచ్చుకుంది కానీ స్టార్ హీరోయిన్స్ లిస్టులో చేరలేకపోయింది. అలాగే ఎక్కువగా ప్లాప్స్ పడటంతో ఫామ్ కూడా కంటిన్యూ చేయలేదు. కానీ ఇండస్ట్రీలో ప్రతి హీరోతో సినిమాలు చేసింది ఛార్మి. ఈరోజు మే 17.. అంటే ఛార్మి పుట్టినరోజు. ఈ సందర్బంగా సోషల్ మీడియాలో ఫ్యాన్స్ - ఇండస్ట్రీకి చెందినవారు ఛార్మికి బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు. ప్రస్తుతం అమ్మడు 33 నుండి 34లో అడుగుపెడుతోంది. దాదాపు 19 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో కొనసాగుతుంది. 2015లో ఓన్ ప్రొడక్షన్ ప్రారంభించి జ్యోతిలక్ష్మి అనే సినిమాలో నటించి నిర్మించింది.
అప్పటినుండి నటన ఆపేసి నిర్మాతగా కొనసాగుతుంది. అయితే ఛార్మి కేవలం డైరెక్టర్ పూరీ జగన్నాథ్ సినిమాలకు మాత్రమే నిర్మాతగా వ్యవహరించడం గమనార్హం. జ్యోతిలక్ష్మి నుండి ఇప్పటివరకు పూరీ తీసిన ప్రతి సినిమాకు నిర్మాణంలో భాగమైంది. అయితే ఛార్మి పుట్టినరోజు సందర్బంగా ఆమె చిన్నప్పటి ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ ఫోటోలో ఛార్మి స్కూల్లో చాలా క్యూట్ గా ఉండటం మనం గమనించవచ్చు. తలమీద పూలతో క్యూట్ ఛార్మి చాలాబాగా ముస్తాబు అయింది. ప్రస్తుతం ఆమె పిక్ నెట్టింట హల్చల్ చేస్తోంది. ఇదిలా ఉండగా.. నిర్మాతగా ప్రస్తుతం విజయ్ దేవరకొండతో లైగర్ సినిమా నిర్మాతలలో ఒకరిగా ఉంది ఛార్మి. ఇటీవలే సోషల్ మీడియాకు కాస్త బ్రేక్ ఇచ్చింది.