Begin typing your search above and press return to search.

ఛార్మీకి 4 కోట్ల పైసా వసూల్??

By:  Tupaki Desk   |   28 Jun 2017 4:59 AM GMT
ఛార్మీకి 4 కోట్ల పైసా వసూల్??
X
హీరోయిన్ ఛార్మీ.. ఇప్పుడు దాదాపుగా మాజీ హీరోయిన్ అయిపోయింది. హీరోయిన్ గా అవకాశాలు రావడం లేదు సరి కదా.. ఆమె కూడా ఆ యాంగిల్ లో ప్రయత్నాలు చేస్తున్నట్లుగా కనిపించడం లేదు. ఫిలిం ఇండస్ట్రీలోనే వేరే యాంగిల్ లో సెటిల్ అయ్యేందుకు ప్రయత్నాలే కాదు.. ఆచరించేస్తోంది కూడా.

ప్రస్తుతం ఈ సీనియర్ భామ పూరీ జగన్ తీసే సినిమాలకు సంబంధించిన ప్రొడక్షన్ యాక్టివిటీస్ ను హ్యాండిల్ చేస్తున్న సంగతి తెలిసిందే. బాలయ్య- పూరీ కాంబినేషన్ లో రూపొందుతున్న పైసా వసూల్ మూవీకి.. ఛార్మీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. తాజాగా ఈ మూవీ షెడ్యూల్ పోర్చుగల్ లో జరిగితే.. అక్కడ కూడా ఛార్మీ బాగానే హంగామా చేసింది. అయితే.. ఈ చిత్రానికి ఛార్మీ అందుకుంటున్న పారితోషికం మొత్తం చాలా మందిని ఆశ్చర్యానికి గురిచేసింది. మొత్తం ప్యాకేజ్ రూపంలో ఈ భామకు 4 కోట్ల మొత్తం ముట్టచెబుతున్నారనే టాక్ వినిపిస్తోంది.

హీరోయిన్ గా ఉండగా కూడా ఛార్మీకి ఏనాడూ ఇంత పెద్ద ఫిగర్ గిట్టుబాటు కాలేదు. కానీ పైసా వసూల్ చిత్రానికి 4 కోట్ల ప్యాకేజ్ అంటే.. మిగతావారికేమో కానీ ఈ భామకు మాత్రం బాగానే పైసలు వసూలయ్యాయన్న మాట. ఈ మూవీని మొత్తం 28 కోట్ల బడ్జెట్ తో పూర్తి చేస్తున్నారని.. ఇందులో బాలయ్య రెమ్యూనరేషన్ 9 కోట్లు కూడా కలిపి ఉంటుందని ఓ టాక్ ఉంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/