Begin typing your search above and press return to search.

ఛార్మీ.. ఈ స్టయిలేంది నానా??

By:  Tupaki Desk   |   11 May 2016 10:30 PM GMT
ఛార్మీ.. ఈ స్టయిలేంది నానా??
X
ఈ మధ్య కాలంలో చాలామంది హీరోయిన్లు స్టయిలింగ్‌ ను బీభత్సంగా ఫాలో అవుతున్నారు. బాలీవుడ్‌ లో సోనమ్‌ కపూర్‌ కు థ్యాంక్స్ చెబితే.. ఇక్కడ మాత్రం సమంతకు థ్యాంక్యూ చెప్పాల్సిందే. డిజైనర్‌ వేర్‌ నుండి కొత్త కొత్త స్టయిల్స్‌ వరకు ఈ భామలు తెగ వేసేసుకోవడంతో.. ఇతర హీరోయిన్లు కూడా బయట కనిపించినప్పుడల్లా అలాగే ఫ్యాషన్ ఫాలో అవుతున్నారు.

ఇవాళ జరిగిన జ్యోతిలక్ష్మి బుక్‌ ఈవెంట్ కు.. ఛార్మి కూడా ఇలాగే ఏదో కొత్తది ట్రై చేసింది. కాని ఆమె స్టయిల్ స్టేట్మెంట్‌ ఏంటనేది ఎవ్వరికీ అర్ధం కాలేదు. చీర కట్టుకొని.. ఆ చీరపై ఏదో టాప్‌ పీస్‌ ఒకటి వేసుకుంది. అదేదో చలేస్తే శాలువా కప్పుకున్నట్లుంది ఈ లుక్‌.

అంతేకాదు.. ఈ మధ్య కాలంలో ఏదో తన ఫిజిక్‌ ను విపరీతంగా చేంజ్‌ చేస్తున్నా అంటూ చెప్పుకొచ్చిన ఛార్మి.. ఇక్కడ చూస్తే ఇంకా ఆంటీ లుక్‌లోనే కనిపించింది. ఇటు బట్టలూ కొత్తగా లేవు.. అటు ఫిజిక్‌ లోనూ ఎటువంటి మార్పూ లేదు. మరి ఇన్నేసి రోజులు కెమెరా కళ్ళ నుండి ఆబ్సెంట్‌ అయ్యి.. ఛార్మి ఏదో మేకోవర్‌ అంటే.. ఇదేనా ఈమె చేసింది. ఏంటి నానా జ్యోతిలక్ష్మి.. వాటీస్‌ దిస్సూ!!