Begin typing your search above and press return to search.

ఛార్మి దిగొచ్చి క్ష‌మాప‌ణ‌లు.. తిక్క కుదిరింది!

By:  Tupaki Desk   |   3 March 2020 12:00 PM IST
ఛార్మి దిగొచ్చి క్ష‌మాప‌ణ‌లు.. తిక్క కుదిరింది!
X
సెల‌బ్రిటీలు డిజిట‌ల్ యుగంలో ఎంతో జాగ్ర‌త్త‌గా ఉండాలి. నెటిజ‌నం నోరు జారినా ప‌ర్వాలేదు గానీ...సెల‌బ్రిటీలు నోరు జారితే ఎలా ఉంటుందో చెప్పాల్సిన ప‌నిలేదు. త‌ర్వాత సారీ చెప్పినా లాభం ఉండ‌దు. నెటిజ‌నులు..ఆక‌తాయిలు నోటికి ప‌నిచెబితే ఎలా ఉంటుందో? ఇప్ప‌టికే చాలా మంది సెల‌బ్రిటీల అనుభ‌వం చూసాం. ఏ కామెంట్ పెట్టినా అందులో అర్ధం.. ప‌రమార్ధం ఉండాలి. న‌లుగురిలో అవేర్ నెస్ తీసుకొచ్చేలా ఉండాలి. అంతే గానీ ఇష్టాను సారం కామెంట్లు చేస్తే ఎలా ఉంటుందో తాజాగా న‌టి క‌మ్ నిర్మాత చార్మీకి అర్థ‌మైంది.

ప్ర‌పంచాన్ని గ‌డ‌గ‌డ‌లాడిస్తోన్న క‌రోనా ఇప్పుడు హైద‌రాబాద్ లో ఎంట‌ర్ అవ్వ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది. . క‌రోనా ఉంద‌ని నిర్ధారించిన ఆ రోగిని గాంధీ ఆసుప‌త్రి లో ఉంచి చికిత్స చేస్తున్నారు. అత‌నితో పాటు ప్ర‌యాణించిన మ‌రో 27 మంది ని వెతికి ప‌ట్టుకుని ప‌రీక్ష‌లు చేయాల‌ని ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఆ రోగి కుటుంబ స‌భ్యులు..11 మంది స్నేహితుల‌ను వైద్యుల ప‌ర్య వేక్ష‌ణ‌ లో ఉంచారు. దీంతో హైద‌రాబాద్ ఇప్పుడు గ‌డ‌గ‌డ‌లాడిపోతుంది. తెలుగు రాష్ట్రాల‌కు పెద్ద ప్ర‌మాదం పొంచి ఉంద‌ని రాత్రి నుంచి కంటి మీద కునుకు లేకుండా ఉన్నారు. ఎటు నుంచి కరోనా దాడి చేస్తుందా? అని హైద‌రాబాద్ ప్ర‌జానీకం లో హైటెన్ష‌న్ రాజుకుంది.

అయితే ఇవేమీ ప‌ట్ట‌ని చార్మీ ``వెల్క‌మ్ టూ క‌రోనా`` అంటూ ఓ సిల్లీ కామెంట్ పెట్టిన సంగ‌తి తెలిసిందే. ఆ కామెంట్ కాస్త వివాదాస్ప‌దంగా మారింది. హైద‌రాబాద్ ప్ర‌జ‌లు క‌రోనా భ‌యంతో ఉంటే నీకు ప‌రాచిక‌మా? ఇలాంటి కామెంట్లు పెడ‌తావా? అంటూ చార్మీపై నెటిజ‌నులు ఒక్క‌సారిగా భ‌గ్గుమ‌న్నారు. చార్మీ పై చెప్ప‌లేని విధంగా అస‌భ్య ప‌ద‌జాలంతో దూషిస్తున్నారు. నీలాంటి వారు స‌హాయం చేయాలి గానీ! ఇలా ఏ మాత్రం బాధ్య‌త‌ల లేకుండా నోరు పారేసుకుంటావా? అని దుమ్మెత్తిపోస్తున్నారు. చార్మి చెవులు..క‌ళ్లు మూసుకు పోయాయా? అంటూ మండి ప‌డుతున్నారు. దీంతో ఆ టార్చ‌ర్ త‌ట్టుకోలేకి చార్మి దిగొచ్చి అంద‌రికీ క్ష‌మాప‌ణ‌లు చెప్పింది. అంత‌కు ముందే ఆ కామెంట్ ని.. వీడియోని డిలీట్ చేసింది. అయినా ఏం లాభం..అప్ప‌టికే అక్షింత‌లు వేయించుకుంది. ఆ క్ష‌మాప‌ణ‌ల‌ తో దెబ్బ‌కి చార్మి తిక్క కుదిరిందంటూ ఇంకొంత మంది కామెంట్లు పెడుతున్నారు.