Begin typing your search above and press return to search.

ఓటీటీ బాదుడు మామూలుగా లేదు బాస్!

By:  Tupaki Desk   |   30 May 2022 6:27 AM GMT
ఓటీటీ బాదుడు మామూలుగా లేదు బాస్!
X
ఎంట‌ర్ టైన్ మెంట్ ప్రియులంతా ఓటీటీకి బాగా అల‌వాటు ప‌డిపోయారు. లాక్ డౌన్ స‌మ‌యంలో ఓటీటీ ప్రియులు మ‌రింత పెరిగారు. ఓటీటీలో కొత్త కొత్త ఆఫ‌ర్లు ప్ర‌క‌టించి స‌బ్ స్ర్కిప్ష‌న్ పెంచుకున్నారు. క‌రోనా లాక్ డౌన్ ని ఓటీటీలు బాగా ఎన్ క్యాష్ చేసుకోగ‌లిగాయి. సినిమాల‌తో పాటు..డిఫ‌రెంట్ ప్రోగ్రామ్స్..వెబ్ సిరీసుల్ని అన్ని ఓటీటీ యాప్ లు త‌క్కువ ధ‌ర‌కే అందించ‌డంతో చందా దారులు భారీ ఎత్తున పెరిగారు.

ఏడాది కి మినిమం ఛార్జ్ చెల్లించి ఎంట‌ర్ టైన్ మెంట్ ని ఆస్వాదించ‌డం రెండుమూడేళ్ల‌గా బాగా అల‌వాటైన ప‌నిగా మారిపోయింది. స‌రిగ్గా ఇప్పుడు ఆ అల‌వాటునే ఓటీటీలు మరోసారి ఎన్ క్యాష్ చేసుకుంటున్నాయి. ఏడాది స‌బ్ స్ర్కిప్ష‌న్ ఛార్జీల‌తో పాటు పాత సినిమాలు చూడాలంటే అద‌నంగా చెల్లించాలి...అదీ ఆ సినిమా చూడ‌టం ఇన్ టైమ్ లో పూర్తిచేయాలి అనే కొత్త నిబంధ‌న‌తో బాధుడు మొద‌లైంది.

జూన్ లో 'జురాసిక్ వ‌ర‌ల్డ్ డొమినియ‌న్' రిలీజ్ అవుతుంది. ఈ సంద‌ర్భంగా 1996 నుంచి వ‌చ్చిన పాత భాగాల్ని వీక్షించాలంటే ఒక్కో దానికి 99 రూపాయ‌లు చెల్లించాలి. అదీ వాటిని 48 గంట‌ల్లో చూసేయాలి. లేదంటే క‌ట్టిన డ‌బ్బులు గోవిందుడు ఖాతాలోనే. ఈ మ‌ధ్య‌నే రిలీజ్ అయిన టాప్ గ‌న్ మావ‌రిక్ ఒక‌ప్ప‌టి 1986 వెర్ష‌న్ చూడాలంటే అదే ప్రైమ్ లో 75 రూపాయ‌లు చెల్లించి చూడాలి.

మూడు నాలుగు రోజుల క్రితం వ‌ర‌కూ ఇవ‌న్నీ ఫ్రీగానే వీక్షిచే వెసులు బాటు ఉండేది. కానీ ఇప్పుడు ఓటీటీలు రూల్స్ మార్చాయి. ఏడాది చంద‌తో పాటు గ‌త చిత్రాలు చూడాలంటే అద‌నంగా డ‌బ్బులు చెల్లించాలి అని కొత్త కండీష‌న్ తెర‌పైకి తీసుకొచ్చింది. ఆ ర‌కంగా ఓటీటీల‌ అస‌లు రంగు ఇప్పుడిప్పుడే బ‌య‌ట ప‌డుతుంది.

ఇంత‌కు ముందు 'కేజీఎఫ్ -2'ని ప్రైమ్ లో పేప‌ర్ వ్యూ మోడ‌ల్ లో తీసుకొచ్చి విమ‌ర్శ‌లు ఎదుర్కున్నారు. దీంతో 'ఆర్ ఆర్ ఆర్ ' వెంట‌నే వెన‌క్కి త‌గ్గింది. పేపర్ వ్యూ విధానానికి అన్ని సిద్దం చేసుకున్న జీ-5 విమ‌ర్శ‌ల దెబ్బ‌కి చందా దారులంద‌రికీ ప్రీగానే వీక్షించే వెసులు బాటు క‌ల్పించింది.

ఇలా ప్ర‌తీసారి వీలు కాదు కాబ‌ట్టి ముందొస్తుగానే జాగ్ర‌త్త ప‌డితే విమ‌ర్శ‌లొచ్చినా స‌మాధానం చెప్ప‌డానికి ఛాన్స్ ఉంటుంది. అందుకే ఓటీటీలు ముందుగానే అల‌ర్ట్ అవుతున్నాయి. సో ఇక నుంచి అన్ని రక‌లుగా ఓటీటీ బాదుడుని ఎదుర్కోవాల్సి ఉంటుంది అన్న మాట‌. ఇప్ప‌ట‌కే థియేట‌ర్ ట‌క్కెట్ ధ‌ర‌లు భారీగా పెరిగాయి. థియేట‌ర్లో సినిమా చూడ‌టం కామ‌న్ మ్య‌న్ కి ఇబ్బంది క‌రంగానే మారింది. తాజాగా ఓటీటీ బాదుడుతోనూ సామాన్యుడికి ఎంట‌ర్ టైన్ మెంట్ ని మ‌రింత భారం అవుతుంద‌ని అర్ధమ‌వుతుంది.