Begin typing your search above and press return to search.
#EMK లో 'మిస్టర్ సి' కథ చెప్పిన చరణ్
By: Tupaki Desk | 24 Aug 2021 10:00 PM ISTటాలీవుడ్ యంగ్ కపుల్ రామ్ చరణ్ ఉపాసనలు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. ముఖ్యంగా ఉపాసన వ్యాపారాలు సేవా కార్యక్రమాలతో ఎంత బిజీగా ఉన్నా కూడా ఆమె మాత్రం తన భర్త రామ్ చరణ్ కు సంబంధించిన అన్ని విషయాలను దగ్గరుండి మరీ చూసుకుంటారు అనడంలో సందేహం లేదు. రామ్ చరణ్ మరియు ఉపాసనలు సోషల్ మీడియాలో ఒకరి గురించి ఒకరు చేసే ట్వీట్స్ మరియు ఒకరి గురించి ఒకరు చెప్పే మాటలు చాలా స్వీట్ గా అనిపిస్తాయి. ఇద్దరి మద్య ఎంత బాండ్డింగ్ ఉందో వారి మాటల ద్వారా తెలుస్తుంది. ముఖ్యంగా రామ్ చరణ్ ను ఎంతో ప్రేమగా ఉపాసన మిస్టర్ సి అంటూ సంభోదిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెట్టడం లేదంటే ఇంటర్వ్యూలు ఇచ్చే సమయంలో అయినా మిస్టర్ సి అంటూ చెప్పడం అందరికి ముచ్చటగొల్పిస్తుంది.
రామ్ చరణ్ ను ఉపాసన మిస్టర్ సి అనడంకు గల కారణం ఏంటీ అనేది చాలా మందికి తెలియదు. చరణ్ లో మొదటి అక్షరం సి కనుక మిస్టర్ సి అంటూ ఉపాసన పిలుస్తుందేమో అంటూ అంతా అనుకుంటారు. కాని అసలు విషయం అది కాదు అంటూ రామ్ చరణ్ తాజాగా ఎవరు మీలో కోటీశ్వరులు షో సందర్బంగా చెప్పుకొచ్చాడు. ఉపాసనతో ఒక సారి లాస్ ఏంజిల్స్ లో ట్రిప్ కు వెళ్లిన సమయంలో అక్కడ మిస్టర్ సి అనే అతి పెద్ద హోటల్ ఉంది. అక్కడ డిన్నర్ చేశాం. ఒక ప్రముఖ చెఫ్ పేరుతో మిస్టర్ సి అని ఆ హోటల్ పేరును పెట్టడం జరిగింది. ఆ హోటల్ ఒక అద్బుతం అన్నట్లుగా ఉందని.. ఇద్దరికి కూడా ఆ హోటల్ బాగా నచ్చడంతో పాటు చాలా కనెక్ట్ అయ్యే విధంగా ఉందని అందుకే మిస్టర్ సి తో కనెక్ట్ అయ్యాం. అలా ఆ మిస్టర్ సి అలా అలా వస్తోంది. ఉపాసన ఎప్పుడు కూడా మిస్టర్ సి అంటూ పిలవడంకు ఆ హోటల్ కారణం అంటూ రామ్ చరణ్ అసలు విషయాన్ని చెప్పుకొచ్చాడు. ఈ షో లో రామ్ చరణ్ ఇంకా పలు విషయాల గురించి చెప్పుకొచ్చాడు.
ఎన్టీఆర్ అనేక ఆసక్తికర విషయాలను రామ్ చరణ్ నుండి రాబట్టాడు. రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ ల మద్య సాగిన ఆర్ ఆర్ ఆర్ సినిమా ముచ్చట్లు మరియు రాజమౌళి గురించి వారిద్దరు మాట్లాడుకున్న సంగతులు ఇలా ప్రతి ఒక్కటి కూడా ప్రేక్షకులకు చాల ఆసక్తిని కలిగించాయి. మొదటి రెండు ఎపిసోడ్స్ కూడా వీరిద్దరే వచ్చినా కూడా ప్రేక్షకులు చాలా ఆసక్తిగా చూశారు. సాదారణంగా కర్టన్ రైజ్ కార్యక్రమం అంటే ఒక్క రోజుతో పూర్తి అవ్వాలి. కాని ఎన్టీఆర్ మరియు చరణ్ ల ముచ్చట్లు రెండు రోజులు సాగాయి. ఈ రెండు రోజుల్లో ఎన్టీఆర్ 25 లక్షల రూపాయలు గెలుచుకున్నాడు. ఆ తర్వాత కూడా ఆటలో ముందుకు సాగుతున్న సమయంలో షో కు సమయం పూర్తి అయ్యింది. వెంటనే బజర్ మోగడం ఆటకు ఫుల్ స్టాప్ పెడుతున్నట్లుగా ఎన్టీఆర్ ప్రకటించడం జరిగి పోయింది. ఎన్టీఆర్ పాతిక లక్షల చెక్కు ను చరణ్ గెలుచుకున్న నేపథ్యంలో చిరంజీవి చార్టిబుల్ ట్రస్ట్ కు ఇవ్వడం జరిగింది. నేటి నుండి షో లో అసలైన ఆట మొదలు కాబోతుంది. ఇప్పటికే అయిదు వారాలకు సంబంధించిన ఎపిసోడ్స్ కు షూటింగ్ చేశారనే వార్తలు వస్తున్నాయి.
ఎన్టీఆర్ వారంలో మూడు రోజులు రాబోతున్నాడు. చాలా కాలం తర్వాత బుల్లి తెరపై ఎన్టీఆర్ ను చూసిన నేపథ్యంలో అభిమానులు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఇక ఆర్ ఆర్ ఆర్ సినిమా షూటింగ్ విషయానికి వస్తే ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ను ముగించినట్లుగా రాజమౌళి కేక్ కట్ చేసి ప్రకటించారు. అయినా కూడా సినిమా ను అక్టోబర్ లో విడుదల చేయడం సాధ్యం కాదేమో అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. థియేటర్ల పరిస్థితి కరోనా కారణంగా ఈ సినిమాను ఈ ఏడాదిలోనే కాకుండా వచ్చే ఏడాది ఆరంభంలో కూడా తీసుకు రావడం లేదట. వచ్చే ఏడాది ఉగాది వరకు సినిమా ను వాయిదా వేస్తున్నట్లుగా అతి త్వరలోనే అధికారిక ప్రకటన రాబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. ఆర్ ఆర్ ఆర్ విడుదల తో సంబంధం లేకుండా ఎన్టీఆర్ త్వరలో కొరటాల శివ దర్శకత్వంలో సినిమాను.. చరణ్ శంకర్ దర్శకత్వంలో సినిమాను చేసేందుకు సిద్దం అవ్వబోతున్నారు.