Begin typing your search above and press return to search.

సోషల్‌ మీడియా ఫ్యాన్‌ ను సర్‌ ప్రైజ్ చేసిన చరణ్‌

By:  Tupaki Desk   |   26 March 2021 5:12 AM GMT
సోషల్‌ మీడియా ఫ్యాన్‌ ను సర్‌ ప్రైజ్ చేసిన చరణ్‌
X
స్టార్‌ హీరోలు.. సెలబ్రెటీలు అంతా కూడా సోషల్‌ మీడియాలో యాక్టివ్‌ గా ఉంటారు. రెగ్యులర్‌ గా వారి విషయాలను షేర్‌ చేస్తూ ఉంటారు. లక్షల మంది అభిమానులు కామెంట్స్‌ రూపంలో ఎన్నో రిక్వెస్ట్‌ లను పెడుతూ ఉంటారు. కొందరు ట్రోల్‌ చేస్తూ ఉంటారు. ఆ స్టార్స్ ఇన్ని కామెంట్స్ ను చూసుకుంటూ ఉంటారా అనే అనుమానం కొందరికి కలుగుతుంది. అయిదు పది కామెంట్స్ చదువుతారేమో అంతకు మించి వారు చదువగలరా అనే అనుమానాలు కొందరు వ్యక్తం చేస్తున్నారు. కాని ప్రతి ఒక్క అభిమాని నుండి వచ్చే కామెంట్ ను స్టార్స్ చూస్తారని రామ్ చరణ్‌ చేసిన ఈ పనితో క్లారిటీ వచ్చింది.

సోషల్‌ మీడియాలో రామ్‌ చరణ్‌ కు అభిమాని శ్రీమతి సుదర్శన్‌ బొడ్డు ఒక రిక్వెస్ట్‌ పెట్టారు. నమస్కారం చరణ్‌.. నేను మీకు పెద్ద ఫ్యాన్‌ మీ కోసం నేను ఒక డ్రీమ్‌ హౌస్‌ మోడల్‌ ను తయారు చేశాను. దీనిని మీకు ఇవ్వాలని కోరికగా ఉంది. మీరు అనుమతిస్తే మిమ్ములను కలిసి ఈ డ్రీమ్‌ హౌస్ మోడల్ ను ఇస్తానంటూ కోరింది. ఆమె కోరికను మన్నించిన రామ్‌ చరణ్‌ స్వయంగా సుదర్శన్‌ బొడ్డు కుటుంబ సభ్యులను కలిసి వారు ఇచ్చిన బహుమానంను స్వీకరించారు. ఆ సమయంలో వారితో సరదాగా మాట్లాడటంతో పాటు ఫొటోలు దిగి వారిని ఆనందపర్చారు. షూటింగ్‌ లతో బిజీ బిజీగా ఉండే స్టార్‌ తమ వంటి సామాన్య అభిమానులకు కూడా కలిసే అవకాశం ఇవ్వడం చాలా సంతోషంగా ఉందంటూ సుదర్శన్‌ బొడ్డు కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.