Begin typing your search above and press return to search.

చరణ్‌ - శంకర్‌ కాంబో మూవీ బిగ్‌ అప్ డేట్‌

By:  Tupaki Desk   |   12 March 2021 6:30 AM GMT
చరణ్‌ - శంకర్‌ కాంబో మూవీ బిగ్‌ అప్ డేట్‌
X
సౌత్‌ ఇండియన్ స్టార్‌ డైరెక్టర్‌ శంకర్ దర్శకత్వంలో రామ్‌ చరణ్ హీరోగా దిల్‌ రాజు నిర్మించబోతున్న సినిమా అధికారిక ప్రకటన ఇటీవలే వచ్చింది. ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యేది ఎప్పుడు అనే విషయంలో క్లారిటీ ఇవ్వలేదు. కాని ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్‌ వర్క్‌ జరుగుతోంది. ఇదే సమయంలో ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ శరవేగంగా జరుతున్నట్లుగా తెలుస్తోంది. శంకర్ సినిమా అనగానే అంతా కూడా ఏఆర్ రహమాన్ సంగీతాన్ని అందిస్తాడని భావించారు. కాని ఈ సినిమా కోసం శంకర్ థమన్‌ తో వర్క్‌ చేయబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.

ఈమద్య కాలంలో థమన్‌ తెలుగు మరియు తమిళంలో వరుసగా సినిమాలు చేస్తూ సూపర్‌ హిట్‌ మ్యూజిక్‌ ఆల్బంలను ఇస్తున్నాడు. దాంతో ఆయన్ను ఈ సినిమా కోసం ఎంపిక చేశారనే వార్తలు వస్తున్నాయి. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం థమన్ ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ సినిమాకు సంగీతాన్ని అందించేందుకు ఇప్పటి నుండే కసరత్తులు మొదలు పెట్టాడు. థమన్‌ గత ఏడాది మొత్తం కూడా అల వైకుంఠపురంలో ఆల్బంతో ట్రెండ్డింగ్ లో ఉన్నాడు. ఈ ఏడాది కూడా ఆయన లెక్కకు మించి సినిమాలకు సంగీతాన్ని అందిస్తున్నాడు. అంత బిజీగా ఉన్న థమన్ కు శంకర్‌ ఈ బాధ్యతను అప్పగించడం కాస్త ఆశ్చర్యంగా ఉంది. కొందరు చరణ్ అభిమానులు మాత్రం రహమాన్ సంగీతం అందించాలని కోరుకుంటున్నారు. ఈ విషయమై అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్‌ చేయాల్సిందే.