Begin typing your search above and press return to search.

ఉయ్యాలవాడ ఇష్యూ.. గజిబిజిగానే ఉందే!

By:  Tupaki Desk   |   2 July 2019 11:44 AM IST
ఉయ్యాలవాడ ఇష్యూ.. గజిబిజిగానే ఉందే!
X
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చారిత్రాత్మక చిత్రం 'సైరా' లో నటిస్తున్నారు. సురేందర్ రెడ్డి ఈ సినిమాకు దర్శకుడు కాగా రామ్ చరణ్ ఈ భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సహజంగా చారిత్రక ప్రాధాన్యం ఉన్న వ్యక్తులపై సినిమాలు తీసే సమయంలో ఫిలిం మేకర్స్ కు ఎదురయ్యే ఇబ్బందులే ఈ సినిమాకు కూడా ఇప్పుడు ఎదురవుతున్నాయి. ఉయ్యాలవాడ కుటుంబ సభ్యులు రీసెంట్ గా రామ్ చరణ్ ఆఫీసు ముందు ధర్నా చేయడం పెద్ద హాట్ టాపిక్ గా మారింది.

సినిమా షూటింగ్ ప్రారంభించక మునుపు ఉయ్యాలవాడ కుటుంబసభ్యులకు చరణ్ ఆర్ధిక సహాయం చేస్తామని హామీ ఇచ్చారట. ఆ హామీని నెరవేర్చలేదని.. ఈ సినిమా షూటింగ్ ఉయ్యాలవాడ గ్రామంలో షూటింగ్ జరిపారని.. కుటుంబానికి సంబంధించిన కొన్ని వస్తువులు వాడడం జరిగిందని.. దానికి కూడా డబ్బు చెల్లించలేదని వారు ఆరోపిస్తున్నారు. మధ్యవర్తులు చరణ్ ను కలవనివ్వకుండా అడ్డుకుంటున్నారని వారు ఆరోపిస్తున్నారు.

అయితే ఇక్కడ రెండు మూడు రకాల సమస్యలు ఉన్నాయట. అందులో ఒకటి.. ఉయ్యాలవాడ కుటుంబ సభ్యులు 'సైరా' టీమ్ నుండి 8 కోట్ల రూపాయల మొత్తం ఆశిస్తున్నారట. అయితే చరణ్ టీమ్ వారికి చెల్లించాలని అనుకున్నా ఉయ్యాలవాడ కు ముగ్గురు భార్యలు.. వారి సంతానం అంతా కలిసి దాదాపు 100 మంది ఉన్నారు. ఇప్పుడు ఈ 8 కోట్ల మొత్తం 15 మందికి సెటిల్ చేస్తే సమస్య పరిష్కారం అయ్యే అవకాశం లేదు. ఎందుకంటే మిగిలిన కుటుంబ సభ్యులు ఎవరైనా ఫ్యూచర్ లో ఇదే డిమాండ్ తో వస్తే ఏం చెయ్యాలి?

రెండవ విషయం ఏంటంటే.. ఒక కుటుంబం ఇప్పటికే ఉయ్యాలవాడకు సంబంధించిన విషయంలో కోర్టుకెక్కారట.. వారు చెప్పేదాని ప్రకారం ఉయ్యాలవాడ ను ఒక కాపు కుటుంబం దత్తత తీసుకుందట.. ఇప్పుడు ఉయ్యాలవాడ కుటుంబం అని చెప్తున్నవారికి అసలు వారసత్వ చట్టం ప్రకారం ఏ హక్కులు ఉండవని అంటున్నారు. సో.. ఈ విషయంలో కోర్టు తీర్పు ఎలా వస్తుందో తెలియదు.

ఇవన్నీ ఒక ఎత్తైతే.. చారిత్రాత్మక వ్యక్తులపై వారు మరణించిన 100 ఏళ్ళ తర్వాత సినిమాలు తీసుకోవచ్చని.. దానికి వారి కుటుంబ సభ్యులకు డబ్బు ఇవ్వాల్సిన పనిలేదని అంటున్నారు. ఈ లెక్కన గాంధీ.. నెహ్రు.. భగత్ సింగ్.. అల్లూరి సీతారామరామ రాజు లాంటి ఎంతోమందిపై పై సినిమాలు తీసిన సమయంలో ఫిలిం మేకర్లు వారి కుటుంబ సభ్యులకు డబ్బు చెల్లించారా అనే ఒక లాజిక్ వినిపిస్తున్నారు.

ఇక ఉయ్యాలవాడ కుటుంబానికి సంబంధించిన వస్తువులను షూటింగ్ లో వాడారు అనే దానిపై కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ వారు అలాంటిదేమీ లేదని తేల్చిపారేస్తున్నారు. ఏదేమైనా 'సైరా' ఇష్యూ పైకి కనిపించినంత సింపుల్ గా అయితే లేదు. తేలటానికి కాస్త సమయం పట్టడం ఖాయమే.