Begin typing your search above and press return to search.
రాజమండ్రి చేరుకున్న చరణ్.. అందుకోసమేనా?
By: Tupaki Desk | 16 Feb 2021 5:00 PM ISTమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం 'ఆర్.ఆర్.ఆర్' సినిమాతో పాటు 'ఆచార్య' షూటింగ్ లో పాల్గొంటూ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న 'ఆచార్య' షూటింగ్ ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ తో పాటు చిత్ర యూనిట్ అక్కడకు చేరుకుంది. ఈ షెడ్యూల్ లో చిరంజీవి - చరణ్ పాల్గొనే ఓ యాక్షన్ సీక్వెన్స్ ని షూట్ చేయడానికి చిత్ర బృందం ప్లాన్ చేసినట్లు సమాచారం. ఇకపోతే రాజమండ్రిలో ఉన్న చరణ్.. 'ఉప్పెన' బ్లాక్ బస్టర్ సెలెబ్రేషన్స్ కి చీఫ్ గెస్ట్ గా హాజరుకానున్నాడు.
పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా బుచ్చిబాబు తెరకెక్కించిన 'ఉప్పెన' సినిమా ఇటీవలే విడుదలై మంచి వసూళ్ళు రాబడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ రాజమండ్రిలో సక్సెస్ సెలబ్రేషన్స్ చేస్తోంది. దీనికి గెస్ట్ గా రాంచరణ్ అటెండ్ అవుతారని ఇప్పటికే ప్రకటించారు. అయితే ఇప్పటికే అక్కడ మకాం వేసిన చరణ్ కోసం బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ వేదికను అక్కడ పెట్టుకున్నారా లేదా అలా కలిసొచ్చిందా అనేది తెలియదు కానీ.. ఈ వేడుక మాత్రం రేపు(ఫిబ్రవరి 17) సాయంత్రం 6 గంటల నుంచి జరగనుంది. ఇకపోతే మెగా ఫ్యామిలీకి రాజమండ్రికి ప్రత్యేకమైన అనుబంధం ఉంది. చరణ్ నటించిన 'రంగస్థలం' మూవీ షూటింగ్ ఎక్కువ శాతం రాజమండ్రి పరిసర ప్రాంతాల్లోనే జరిగింది. అయితే చిరంజీవి మాత్రం 'ఆపద్భాందవుడు' తర్వాత రాజమండ్రిలో షూటింగ్ చేయలేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు చిరు - చరణ్ కలిసి నటిస్తున్న 'ఆచార్య' షూటింగ్ రాజమండ్రిలో జరుపుకోనుంది.