Begin typing your search above and press return to search.

మెగా కిడ్స్ తో ఎంజాయ్ చేస్తున్న చరణ్...!

By:  Tupaki Desk   |   6 May 2020 9:00 PM IST
మెగా కిడ్స్ తో ఎంజాయ్ చేస్తున్న చరణ్...!
X
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన ఫ్యామిలీతో ఎంతగా సమయం కేటాయించడానికి ఇష్టపడతాడో మనందరికీ తెలుసు. షూటింగ్ కి ఏ మాత్రం గ్యాప్ వచ్చినా తన కుటుంబంతోనే గడుపుతుంటాడు. తన భార్య ఉపాసనతో కలిసి ఔటింగ్ లకు వెళ్తూ ఫ్యామిలీ మ్యాన్ అనిపించుకుంటూ ఉంటాడు. ఇప్పుడు కరోనా మహమ్మారి పుణ్యమా అని వారితో ఇంకా ఎక్కువ సమయం గడిపే అవకాశం చరణ్ కి లభించింది. దీంతో లాక్ డౌన్ సమయాన్ని ఫుల్ గా వాడేసుకుంటున్నాడు. తన భార్యకు సపర్యలు చేస్తున్నాడు.. అమ్మ నాన్నమ్మ దగ్గర వెన్న చిలకడం నేర్చుకుంటున్నాడు.. ఇంటి పనుల్లో వారికి సహాయం చేస్తూ రియల్ మ్యాన్ అనిపించుకుంటున్నాడు. అంతేకాకుండా ఎప్పటికప్పుడు కరోనా నివారణకు అవగాహన కల్పించే పోస్టులను పెడుతూ సమాజంలో తన వంతు బాధ్యతను నెరవేరుస్తున్నారు. ఇంట్లోనే ఉంటూ మెగా కాంపౌండ్ లోని కిడ్స్ తో ఆడుకుంటున్నాడు.

చరణ్ పిల్లల పట్ల ఎక్కువ మక్కువ చూపిస్తూ ఉంటాడని మనం అనేక సందర్భాల్లో చూసాం. ముఖ్యంగా మెగా ఫ్యామిలీలోని కిడ్స్ తో టైం స్పెండ్ చేస్తూ వారితో ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. సందర్భం వచ్చినప్పుడల్లా వారితో గడుపుతూ ఆ విషయాలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు తాజాగా చరణ్ పిల్లలతో దిగిన పిక్ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫొటోలో చిరునవ్వులు చిందిస్తున్న చరణ్ తో తన సోదరి శ్రీజ కూతురు మరియు అల్లు అర్జున్ కొడుకు అయాన్ ఉన్నారు. వారిని ఆప్యాయంగా కౌగిలించుకున్న రామ్ చరణ్ ని చూస్తే ఎవరికైనా ముచ్చటేస్తుంది.

కాగా రామ్ చరణ్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న 'ఆర్.ఆర్.ఆర్'లో నటిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన చరణ్ ఇంట్రో వీడియోలో 'అల్లూరి సీతారామరాజు'గా అదరగొట్టాడు. అంతేకాకుండా తండ్రి చిరంజీవి హీరోగా నటిస్తున్న 'ఆచార్య' సినిమాలో కీలక పాత్రలో నటించనున్నాడు. ఈ సినిమాని తన సొంత బ్యానర్ కొణెదల ప్రొడక్షన్స్ పై నిర్మించనున్నాడు. అంతేకాకుండా మలయాళ సూపర్ హిట్ సినిమా 'లూసిఫర్'ని చిరంజీవితో రీమేక్ చేయనున్నాడు. వీటితో పాటు మరికొన్ని అప్డేట్స్ ఉండగా.. లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత వాటి గురించి రామ్ చరణ్ ప్రకటించే అవకాశం ఉంది.