Begin typing your search above and press return to search.

కొత్తజంటతో చరణ్ దంపతుల సందడి!

By:  Tupaki Desk   |   13 Dec 2021 12:30 AM GMT
కొత్తజంటతో చరణ్ దంపతుల సందడి!
X
ఉపాసన సోదరి అనుష్పాల వివాహం అర్మాన్ ఇబ్రహీమ్ తో రీసెంట్ గా జరిగింది. 'దోమకొండ' ఫోర్టులో జరిగిన ఈ వివాహానికి చాలామంది ప్రముఖులు హాజరయ్యారు. ఈ పెళ్లికి సంబంధించి చరణ్ - ఉపాసన ఇద్దరూ కూడా అందంగా సందడి చేశారు. ఈ పెళ్లికి సంబంధించిన అన్ని వ్యవహారాలను ఉపాసన దగ్గరుండి చూసుకున్నారు. కొత్త జంటతో సరదాగా సందడి చేశారు. అందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతున్నాయి.

అనుష్పాల అపోలో హాస్పిటల్స్ కి వైస్ ప్రెసిడెంట్. ఇక అర్మాన్ ఇబ్రహీమ్ కార్ రేసర్ అనే సంగతి తెలిసిందే. వివాహం అనంతరం తమ కుటుంబ సభ్యుడిగా అర్మాన్ ఇబ్రహీమ్ లో చరణ్ ఆత్మీయ ఆహ్వానం పలికాడు. ఇద్దరూ కలిసి ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. రెండు జంటలు కూడా కలిసి సెల్ఫీలు తీసుకున్నారు. ఆ సమయంలో తీసిన ఫోటోలను ఉపాసన షేర్ చేశారు. సోషల్ మీడియాలో ఉపాసన ఎప్పుడూ యాక్టివ్ గానే ఉంటారు. అందువలన ఈ పెళ్లికి సంబంధించిన ఫొటోలు చరణ్ ఫ్యాన్స్ ను ఖుషీ చేస్తున్నాయి.

ఇక ఉపాసన విషయానికి వస్తే ఒక వైపున అపోలో హాస్పిటల్స్ కి సంబంధించిన బాధ్యతలను చక్కబెడుతూనే, మరో వైపున జంతువుల సంరక్షణ బాధ్యతలను చూసుకుంటున్నారు. ఇటీవలే ఆమె రెండు ఆసియా సింహాలను దత్తత చేసుకున్న విషయం తెలిసిందే. చరణ్ విషయానికి వస్తే .. ఆయన తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'ఆర్ ఆర్ ఆర్' రెడీ అవుతోంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన ప్రమోషన్స్ లో ఆయన బిజీగా ఉన్నాడు. శంకర్ సినిమాను ఆల్రెడీ సెట్స్ పైకి తీసుకెళ్లిన ఆయన, ఆ తరువాత సినిమాను గౌతమ్ తిన్ననూరితో చేయనున్నాడు.