Begin typing your search above and press return to search.

భలే కో-ఇన్సిడెంట్.. అక్కడకు చెర్రీ.. ఇక్కడకు మెగాస్టార్

By:  Tupaki Desk   |   20 Sept 2021 12:00 PM IST
భలే కో-ఇన్సిడెంట్.. అక్కడకు చెర్రీ.. ఇక్కడకు మెగాస్టార్
X
కావాలనే జరిగిందని చెప్పటం లేదు కానీ.. అనూహ్యంగా రెండు రోజుల్లో ఒకటి తర్వాత ఒకటిగా చోటు చేసుకున్న ఈ రెండు సంఘటనలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయని చెప్పాలి. శేఖర కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య నటించిన లవ్ స్టోరీ మూవీ ప్రీరిలీజ్ ఫంక్షన్ ఆదివారం ఘనంగా జరగటం తెలిసిందే. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి.. బాలీవుడ్ మిస్టర్ ఫర్ ఫెక్టు అమీర్ ఖాన్ విశిష్ట అతిధులుగా హాజరు కావటం తెలిసిందే.

ఆసక్తికరమైన అంశం ఏమంటే.. దీనికి ఒక రోజు ముందుగా.. నాగార్జున నేతృత్వంలో నడిచే బిగ్ బాస్ సీజన్ 5కు రావటం తెలిసిందే. అయితే.. హాట్ స్టార్ బ్రాండ్ అంబాసిడర్ హోదాలో ఆయన హాజరు కావటం.. అదే విషయాన్ని రివీల్ చేయటం తెలిసిందే. నాగ్ నిర్వహించే కార్యక్రమానికి చెర్రీ హాజరు కావటం ద్వారా ఆసక్తికర కాంబినేషన్ కు అవకాశం చోటు చేసుకుంది. ఇదిలా ఉంటే.. ఆదివారం జరిగిన లవ్ స్టోరీ ప్రీరిలీజ్ ఫంక్షన్ కూడా నాగ్ కుమారుడు నాగచైతన్యకు సంబంధించిన పెద్ద ప్రోగ్రాం.

దీనికి కూడా మెగా ఫ్యామిలీ నుంచి ఏకంగా మెగాస్టార్ హాజరు కావటం విశేషం. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. ఈ కార్యక్రమానికి నాగార్జున మాత్రం రాకపోవటం ఆశ్చర్యానికి గురి చేసింది. ఎందుకిలా? అన్నది బయటకు రాలేదు కానీ.. రెండు రోజుల వ్యవధిలో నాగ్ నిర్వహించే బిగ్ బాస్ కు మెగా వారసుడు చెర్రీ హాజరైతే.. నాగ్ కుమారుడు చైతూ ప్రోగ్రాంకు మెగాస్టార్ స్వయంగా వెళ్లటం.. చూసినప్పుడు వాటే కో-ఇన్సిడెంట్ అనుకోకుండా ఉండలేం.