Begin typing your search above and press return to search.

అలియా వెంట చ‌ర‌ణ్‌..తార‌క్? ఏంటి మ్యాట‌ర్!

By:  Tupaki Desk   |   7 March 2022 6:02 AM GMT
అలియా వెంట చ‌ర‌ణ్‌..తార‌క్? ఏంటి మ్యాట‌ర్!
X
మెగా ప‌వ‌ర్ స్టార్ చ‌ర‌ణ్‌- యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్- బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భ‌ట్ కాంబినేష‌న్ లో పాన్ ఇండియా చిత్రం `ఆర్ ఆర్ ఆర్` తెర‌కెక్కిన సంగ‌తి తెలిసిందే. ఇందులో చర‌ణ్ అల్లూరి సీతారామ‌రాజు పాత్ర‌లో న‌టిస్తుండ‌గా అలియా భ‌ట్ స‌తీ పాత్ర‌లో న‌టిస్తోంది. ఇక యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ కొమ‌రం భీమ్ పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు.

అన్ని ప‌నులు పూర్తిచేసుకుని ఎట్ట‌కేల‌కు మార్చి 25న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. ఇక ఈ సినిమా ప్ర‌మోష‌న్ లో చ‌ర‌ణ్‌-తార‌క్-అలియా భ‌ట్ లు ఏ రేంజ్ లో ర‌చ్చ చేసారో చెప్పాల్సిన ప‌నిలేదు. ముంబై ఈవెంట్ల‌లో ఒక‌ర్ని ఒక‌రు ఆట‌ప‌ట్టించుకోవ‌డం.. జోకులు వేసుకోడం స‌హా ముగ్గురి మ‌ధ్య చాలా స్నేహ భావం క‌నిపించింది.

అలియాభ‌ట్ ఇద్ద‌రితో క‌లిసి న‌టించ‌డం ఇదే తొలిసారి అయినా క్లోజ్ ప్రెండ్ లా మూవ్ అయింది. ఎన్నో ఏళ్ల నుంచి ముగ్గురి మ‌ధ్య మంచి ప్రెండ్ షిప్ ఉంద‌న్న భావ‌న‌ని తీసుకొచ్చింది. `ఆర్ ఆర్ ఆర్` కోసం అలియాభ‌ట్ కేటాయించింది కొన్ని రోజులే అయినా చాలా త‌క్కువ స‌మ‌యంలోనే ముగ్గురు మంచి స్నేహితుల‌య్యారని ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో అర్ధ‌మైంది.

ఆ వెంట‌నే తార‌క్ త‌న త‌దుప‌రి చిత్రంలో హీరోయిన్ గా అలియాభ‌ట్ ని ఎంపిక చేసిన‌ట్లు ప్ర‌చారం సాగింది. త‌న 30వ చిత్రం కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కునుంది. ఇందులో హీరోయిన్ గా అలియానే లాక్ చేసిన‌ట్లు త్వ‌ర‌లోనే అధికారిక ప్ర‌క‌ట‌న వ‌స్తుంద‌ని అంటున్నారు.

ఇక చ‌ర‌ణ్ ఓ యాడ్ లో అలియా భ‌ట్ తో క‌లిసి న‌టించాడు. అలియా-చ‌ర‌ణ్ ఫోటోలు ప్రింటింగ్ లో ప‌క్క ప‌క్క‌నే ఉన్నాయి. దానికి సంబంధించిన వీడియో యాడ్ కూడా రిలీజ్ కానుంది. మ‌రి ఇలా ఒకేసారి చ‌ర‌ణ్‌-తార‌క్ అలియా వెంట ఎందుకు ప‌డ్డ‌ట్లు? అలియా భ‌ట్ బ్రాండ్ ఇమేజ్ కార‌ణం కావొచ్చు అన్న సందేహాలు తెర‌పైకి వ‌స్తున్నాయి. అలియా భ‌ట్ చాలా త‌క్కువ స‌మ‌యంలోనే బాలీవుడ్ లో త‌న మార్క్ వేసింది. యంగ్ హీరోల నుంచి సీనియ‌ర్ హీరోల వ‌ర‌కూ అంద‌రి స‌ర‌స‌న న‌టిస్తోంది.

యాక్టింగ్ ప‌రంగా వెరీ ట్యాలెంటెడ్. ఎలాంటి పాత్ర‌ల‌నైనా అవ‌లీల‌గా పోషించ‌గ‌ల‌న‌ద‌ని ఇటీవ‌లే రిలీజ్ అయిన `గంగూబాయి క‌తియ‌వాడి`తో నిరూపించింది. గంగూబాయి గా బాలీవుడ్ తెర‌పై త‌న‌దైన మార్క్ వేసింది. ఈ సినిమా అలియాకి ప్ర‌త్యేకమైన గుర్తింపుని తీసుకొచ్చింది. ఇమేజ్ రెట్టింపు అయింది. ల‌క్కీగా సినిమా రిలీజ్ కి ముందే చ‌ర‌ణ్‌-తార‌క్ త్ర‌యం అలియా తో క్లోజ్ గా మూవ్ అవ్వ‌డం `ఆర్ ఆర్ ఆర్` బాలీవుడ్ బెల్డ కి .. ప్యూచ‌ర్ ప్రాజెక్ట్ ల‌కి క‌లిసొచ్చే అంశంగా చెప్పొచ్చు.