Begin typing your search above and press return to search.
బన్నీ తరువాత అంతగా రెచ్చిపోయింది అతగాడే!
By: Tupaki Desk | 20 Dec 2021 10:37 AM ISTఅల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన 'పుష్ప' భారీ ఓపెనింగ్స్ ను రాబట్టింది. షూటింగు విషయంలో ఎదురైన అంతరాయాలు .. జరిగిన జాప్యం ఈ సినిమా అవుట్ పుట్ పట్ల ప్రభావం చూపాయనే విషయం అర్థమవుతూనే ఉంది. సుకుమార్ కి మరింత సమయం ఇస్తే బాగుండేదని అనుకునేవారి సంఖ్య ఎక్కువగానే ఉంది. ముందుగానే రిలీజ్ డేట్ ఇచ్చేసి .. ఆ దిశగా హడావిడిగా పరిగెత్తడం వల్లనే ప్రేక్షకులు ఆశించిన స్థాయిలో సంతృప్తిని పొందలేకపోయారనే టాక్ బలంగానే వినిపిస్తోంది.
ఈ సినిమాలో పుష్పరాజ్ గా బన్నీ నేనొక్కడినే అన్నట్టుగా ఒంటి చేత్తో కథను ముందుకు నడిపించాడు. అందుకు ప్రేక్షకుల నుంచి ఆయనకి మంచి మార్కులు పడుతున్నాయి. అయితే కథలో అన్ని పాత్రలు సమానంగా పండినప్పుడే ఏ సినిమా అయినా పూర్తి సంతృప్తిని కలిగిస్తుంది. పుష్పలో కొన్ని పాత్రలను లుక్ పరంగా డిజైన్ చేసిన తీరు బాగుంది.
అప్పటివరకూ ఉన్న ఇమేజ్ ను కాదని సునీల్ .. అనసూయ వంటి ఆర్టిస్టులను కొత్తగా చూపించాలనే ఆలోచన బాగుంది. కానీ ప్రేక్షకులు ఆ పాత్రల నుంచి ఆశించిన స్టఫ్ ను మాత్రం అందించలేకపోయారు.
ఇక రష్మిక పోషించిన 'శ్రీవల్లీ' పాత్రను కూడ ఏదో చేయబోతే ఏదో అయిందనిపిస్తుంది. కథకి కాస్త దగ్గరగా కనిపించి ప్రేక్షకులను తనవైపు తిప్పుకున్న నటుడిగా అజయ్ ఘోష్ కనిపిస్తాడు. వాస్తవానికి అజయ్ ఘోష్ ఆ స్థాయి నటనను కనబరచడంలో ఆశ్చర్యం లేదు.
ఆయన చాలా సీనియర్ ఆర్టిస్ట్ .. కాకపోతే టైమ్ ఇప్పుడు కలిసొచ్చింది. కరడుగట్టిన పోలీస్ ఆఫీసర్ పాత్రల్లో తమిళంలోను ఆయన మంచి పేరు తెచ్చుకున్నాడు. కొండారెడ్డి పాత్ర కొంతకాలం పాటు ప్రేక్షకులకు గుర్తుండేలా చాలా బాగా చేశాడు.
ఇక వీళ్లంతా కాకుండా ఇంకా బాగా చేసింది ఎవరయ్యా అనే ఆలోచన చేస్తే మన కళ్ల ముందు మెదిలే పాత్రనే 'కేశవ'. పుష్ప పాత్ర పక్కనే ఉంటూ కేశవ పాత్ర ఆకట్టుకుంటుంది. ఆ పాత్రలో అంతగా ఒదిగిపోయిన ఆ నటుడి పేరు జగదీశ్. అతణ్ణి ఎక్కడో చూసినట్టుగా చాలామందికి అనిపిస్తుంది .. అతను ఇంతకుముందు 'పలాస' సినిమాలో హీరోయిన్ కి అన్నయ్యే పాత్రలో నటించి మెప్పించాడు.
శ్రీకాకుళం యాసలో అదరగొట్టేశాడు. ఇక ఈ సినిమాలో చిత్తూరు యాసలోనూ దుమ్మురేపేశాడు. తనకి ఇచ్చిన పాత్రలో అతను ఎంతగా ఇన్వాల్వ్ అయ్యాడనేది ఏ సినిమా చూస్తే అర్థమవుతుంది. బన్నీ అయినా చిత్తూరు యాసలో పట్టి పట్టి డైలాగ్స్ చెబుతున్నట్టుగా అనిపిస్తుంది గానీ, జగదీశ్ చూపించిన ఫ్లో మాత్రం మామూలుగా ఉండదు.
ఈ సినిమా చూసిన సుకుమార్ ఆయనను ప్రత్యేకంగా అభినందించాడంటే అర్థం చేసుకోవచ్చు. జగదీశ్ కి మాస్ మూవీస్ లో మంచి అవకాశాలు దొరికే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.