Begin typing your search above and press return to search.

ఇందువ‌ద‌న‌: ఇందును ప్రేమించిన వాసు క‌థేమిటి?

By:  Tupaki Desk   |   27 Jun 2021 11:36 AM GMT
ఇందువ‌ద‌న‌: ఇందును ప్రేమించిన వాసు క‌థేమిటి?
X
యువ‌హీరో వ‌రుణ్ సందేశ్ కొంత గ్యాప్ త‌ర్వాత న‌టిస్తున్న సినిమా `ఇందువ‌ద‌న‌`. ఫ‌ర్నాజ్ శెట్టి క‌థానాయిక‌. MSR దర్శకత్వంలో శ్రీ బాలాజీ పిక్చర్స్ బ్యానర్ పై శ్రీమతి మాధవి ఆదుర్తి నిర్మిస్తున్నారు.

ఇంత‌కుముందు విడుద‌లైన‌ ఇందువదన ఫస్ట్ లుక్ కి చ‌క్క‌ని ప్ర‌శంస‌లు ద‌క్కాయి. ఇది ఘాడ‌మైన ప్రేమానుభూతుల్ని మిగిల్చే రొమాంటిక్ చిత్ర‌మ‌ని వ‌రుణ్ సందేశ్ అభిమానులు భావించారు. ఇందులో అతడి లుక్ పూర్తిగా మారిపోయింది. తీరైన రూపంతో ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపిస్తున్నాడు. క‌థానాయిక ఫర్నాజ్ అంద‌చందాలు ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచాయ‌న్న టాక్ వ‌చ్చింది. వ‌రుణ్ కంబ్యాక్ ని అదిరిపోయే రేంజులో ప్లాన్ చేస్తున్నాడ‌ని ఫ్యాన్స్ భావించారు.

తాజాగా నాయ‌కానాయిక‌ల కొత్త పోస్ట‌ర్ల‌ను విడుద‌ల చేయ‌గా అంతే గొప్ప స్పంద‌న వ‌స్తోంది. ఈ పోస్ట‌ర్ల‌ను ఎంతో క‌ళాత్మ‌కంగా తీర్చిదిద్దిన తీరు ఆక‌ట్టుకుంది. వరుణ్ సందేశ్ ఇందువదన సినిమా కోసం తనను తాను కొత్తగా ఆవిష్కరించుకుంటున్నారు. ఇందులో వాసు అనే పాత్ర‌లో అత‌డు న‌టిస్తున్నాడు.

వ‌రుణ్ వాసు పాత్ర తో పాటు ఫ‌ర్నాజ్ పోషిస్తున్న ఇందు పాత్రకి సంబంధించిన లుక్ అంతే ప్ర‌త్యేకంగా డిజైన్ చేసారు. ఇప్ప‌టికే సినిమా చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. ఈ సినిమాకు కథ- మాటలు సతీష్ ఆకేటీ అందిస్తుండగా శివ కాకాని సంగీతం సమకూరుస్తున్నారు. సీనియర్ ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్.. బి మ‌ర‌ళికృష్ణ సినిమాటోగ్రాఫి ప్ర‌ధాన బ‌లాలు. రఘు బాబు- అలీ- నాగినీడు- సురేఖ వాణి- ధనరాజ్- తాగుబోతు రమేష్ త‌దిత‌రులు న‌టిస్తున్నారు.