Begin typing your search above and press return to search.

మీ ఆడవాళ్లను పంపిస్తే..మేటర్ ఉందో లేదో చెప్తారు సార్!

By:  Tupaki Desk   |   6 May 2020 5:00 AM IST
మీ ఆడవాళ్లను పంపిస్తే..మేటర్ ఉందో లేదో చెప్తారు సార్!
X
తెలుగు సీరియల్ హర్షవర్ధన్ తెలుసు కదా.. అదే అమృతం సీరియల్ లో కన్పిస్తాడు. చాలా సినిమాలలో కూడా నటించాడు. నటన మాత్రమే కాదు సినీ రచనలో కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు పొందాడు. గత కొన్నేళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతూ.. మనం, గుండెజారి గల్లంతయ్యిందే సినిమాలకు రచయితగా పని చేశాడు. కెరీర్ ఎంత పీక్స్ లో ఉన్నా హర్ష వర్ధన్ పర్సనల్ గా మాత్రం ఒంటరిగానే ఉంటున్నాడు. ముఖ్యంగా పెళ్లి పెళ్లి విషయం ఎవరికీ పెద్దగా తెలియదు. ఇక లాక్ డౌన్ కారణంగా ఇంట్లో ఉంటున్న ఆయన తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన లైఫ్ కి సంబంధించిన విషయాలను షేర్ చేసుకున్నాడు. హర్షవర్ధన్ ఫస్ట్ దర్శకుడు కావాలని ఇండస్ట్రీకి వచ్చాడట. అయితే నటుడిగా క్లిక్కవడంతో అమృతం సిరియల్ ఆఫర్ వచ్చింది. సీనియర్ కమెడియన్ గుండు హనుమంతరావు కాంబినేషన్ లో వచ్చిన ఆ సీరియల్ ఎంతో పేరు తీసుకొచ్చింది. హర్షవర్ధన్ అమృతం సీరియల్ తోనే జనాలకు అమితంగా దగ్గరయ్యాడు.

అయితే హర్షవర్ధన్ పెళ్లి చేసుకోలేదన్న విషయం పై క్లారిటీ ఇచ్చాడు. 'మనం ఏదో సాధించాలని ఇండస్ట్రీకి వచ్చాము. మనల్ని నమ్మి మనతో వచ్చే వారిని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం ఉండదు. వారికి నచ్చినట్లుగా నేను ఉండలేను. సరైన సమయాన్ని కూడా కేటాయించలేనని చెప్పాడు. 'నిజ జీవితంలో పెళ్లి అనేది కంపల్సరీ కాదు. ఎంతో మంది ఎన్నో అంటుంటారు. పెళ్లి పై ఒక మంచి కొటేషన్ ఉంది. పెళ్లి అనేది పబ్లిక్ టాయిలెట్ లాంటిది. బయట ఉన్నవాడు ఎప్పుడు లోపలికి వెళదామా అని అనుకుంటాడు. లోపల ఉన్నవాడు ఎప్పుడు బయటకు వద్దామా అని అనుకుంటాడు' అని హర్షవర్ధన్ తనదైన శైలిలో వివరణ ఇచ్చాడు. పెళ్లి చేసుకోకపోతే.. ఏమైనా ప్రాబ్లమ్ ఉందా? అని ఓ కమెడియన్ నాతో ఇన్ డైరెక్ట్ గా అన్నాడు. 'కమెడియన్ వేసిన సెటైర్ కి నాకు కోపం వచ్చి.. నన్ను కూడా ఒక వ్యక్తి ఇలానే అడిగాడు సార్.. వెంటనే అతని చెల్లిని లేదా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని పంపిస్తే విషయం ఉందో లేదో తెలిసేలా చేస్తానని ఆడిగేసాను సర్..' అని జవాబిచ్చాడట.