Begin typing your search above and press return to search.
కోలీవుడ్ ని వీడని విషాదాలు...కరోనాతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ కన్నుమూత
By: Tupaki Desk | 17 May 2021 4:04 PM ISTకరోనా కల్లోలం అన్ని సినీ ఇండస్ట్రీల కన్నా కోలీవుడ్ పై ప్రభావం అధికంగా చూపుతోంది. ప్రస్తుతం కోలీవుడ్ పరిశ్రమ అత్యంత దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటోంది. కరోనా తీవ్రతతో సినిమా షూటింగ్ లు అన్నీ ఆగి పోయాయి. దీంతో ఇండస్ట్రీ పై ఆధారపడ్డ అనేక మంది కార్మికులు అష్టకష్టాలు పడుతున్నారు. గత ఏడాది, ఈ ఏడాది కరోనా కారణంగా కోలీవుడ్ ఇండస్ట్రీ రూ.1000 కోట్ల మేర నష్టపోయిందని అంచనా. ఇదిలా ఉంటే సినీ పరిశ్రమకు కష్టాలతో పాటు నటీనటులు, దర్శక నిర్మాతలు మరణాలు కూడా కుంగదీస్తున్నాయి.
తమిళ టాప్ కమెడియన్ వివేక్ తో పాటు పలువురు దర్శకులు, నటులు ఇప్పటికే కరోనా కాటుకు బలయ్యారు. తాజాగా కరోనా రక్కసికి మరో తమిళ నటుడు బలయ్యాడు. ప్రముఖ తమిళ నటుడు నితీష్ వీరా(45) కరోనా బారిన పడి చికిత్స పొందుతూ సోమవారం కన్నుమూశాడు. ధనుష్ హీరోగా నటించగా గత ఏడాది విడుదలైన అసురన్ ఈ సినిమాతో నితీష్ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అలాగే ఆయన పేరరసు, వెన్నిల కబడి కుళు, పుదు పెట్టయ్ తదితర చిత్రాల్లో కీలక పాత్రలు పోషించాడు.
ప్రస్తుతం నితీష్ విజయ్ సేతుపతి, శృతిహాసన్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న లాభం సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. నీరో అనే మరో సినిమాలో యాక్ట్ చేస్తున్నాడు. ఇటీవల కరోనా బారిన పడ్డ నితీష్ ఆసుపత్రిలో చేరగా చికిత్స ఫలించకపోవడంతో సోమవారం మృతి చెందాడు. నితీష్ వీరా మృతితో కోలీవుడ్లో విషాదం నెలకొంది. ఆయన మృతి పట్ల పలువురు సినీ నటులు సంతాపం వ్యక్తం చేశారు.