Begin typing your search above and press return to search.

‘ఆదిపురుష్’ టీమ్ లో మార్పులు..?

By:  Tupaki Desk   |   25 Jun 2021 4:30 AM GMT
‘ఆదిపురుష్’ టీమ్ లో మార్పులు..?
X
యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ కిట్ లో మొత్తం నాలుగు చిత్రాలు ఉన్నాయి. ఇందులో అత్యంత ఆస‌క్తిని రేకెత్తిస్తున్న చిత్రం ‘ఆదిపురుష్‌’. ఈ చిత్రం రామాయణం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుండడం.. ఇందులో ప్రభాస్ రాముడిగా కనిపించనుండడంతో అందరిలోనూ అటెన్షన్ క్రియేట్ అయ్యింది. నిజానికి తెలుగులో.. ఎన్టీఆర్‌, శోభ‌న్ బాబు త‌ర్వాత ప్రముఖంగా ఎవ‌రూ రాముడి పాత్ర వేయ‌లేదు.

ప్ర‌భాస్‌ పాన్ ఇండియా స్టార్ గా వెలుగుతున్న ఈ స‌మ‌యంలో రాముడి క్యారెక్ట‌ర్ పోషిస్తుండ‌డంపై స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది. ‘ఆదిపురుష్‌’లో ప్రభాస్ ఎలా కనిపించబోతున్నాడు? అన్న‌దే అంద‌రిలో ఆస‌క్తిని రేకెత్తిస్తున్న అంశం. ఇదిలాఉంటే.. ఈ సినిమా టీమ్ లో మార్పులు చేర్పులు చోటు చేసుకున్నాయ‌నే ప్ర‌చారం సాగుతోంది.

‘ఆదిపురుష్‌’లో ప్రభాస్ రాముడిగా నటిస్తుండగా.. లంకేశ్వరుడిగా బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ కనిపించబోతున్నారు. సీత పాత్ర‌లో కృతి స‌న‌న్ నటిస్తున్నారు. వీరితోపాటు పలువురు కీలక పాత్రల కోసం ఫైనల్ అయ్యారు. అయితే.. హిందీ ‘బిగ్ బాస్’ ఫేం సిద్ధార్థ్ శుక్లాను కూడా ఈ చిత్రంలోకి తీసుకున్నార‌నే ప్ర‌చారం సాగింది. మంచి టాలెంటెడ్ యాక్ట‌ర్ గా పేరు తెచ్చుకున్న ఇత‌న్ని ఫైన‌ల్ చేశార‌నే టాక్ వ‌చ్చింది. కానీ.. త‌న‌కు ఎలాంటి స‌మాచారం లేద‌ని ఆ మ‌ధ్య‌ క్లారిటీ ఇచ్చాడు సిద్ధార్థ్‌.

లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. సిద్ధార్థ్ ఉన్నాడ‌నే అంటున్నారు. ఓ కీల‌క‌మైన పాత్ర కోసం అత‌న్ని తీసుకున్నార‌ని బాలీవుడ్ స‌ర్కిల్స్ లో చ‌ర్చ సాగుతోంది. మ‌రి, ఈ న‌టుడిని తీసుకున్నారా? లేదా? అనేది యూనిట్ క‌న్ఫామ్ చేయాల్సి ఉంది.

ఇదిలాఉంటే.. ఈ మ‌ధ్య‌నే మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం షూటింగుల‌కు అనుమ‌తిచ్చిన సంగ‌తి తెలిసిందే. దీంతో కొత్త షెడ్యూల్ ప్లాన్ చేస్తోంది యూనిట్‌. ఔట్ డోర్ షూటింగ్ ఇంకా 90 రోజులు బ్యాలెన్స్ ఉంద‌ని తెలుస్తోంది. ఈ సినిమా ఎక్కువ భాగం సీజీ వ‌ర్క్స్ మీద‌నే న‌డిపించాల్సి ఉన్నందువ‌ల్ల‌.. త్వ‌ర‌గా ఫినిష్ చేసి, ఇండోర్ లో గ్రాఫిక్స్ వ‌ర్క్ పై దృష్టి పెట్టాల‌ని చూస్తున్నాడు ద‌ర్శ‌కుడు ఓం రౌత్‌.