Begin typing your search above and press return to search.
సినీ ఇండస్ట్రీలో మహమ్మారి తీసుకొచ్చిన మార్పులు...!
By: Tupaki Desk | 21 July 2020 10:30 AM ISTసినీ ఇండస్ట్రీలో ఎన్నో మార్పులకు కరోనా మహమ్మారి కారణం అవుతోంది. గత నాలుగు నెలలుగా షూటింగ్స్ బంద్ అయ్యాయి.. సినిమా థియేటర్స్ క్లోజ్ అయ్యాయి. దీంతో ఇప్పట్లో సినిమా థియేటర్స్ తెరుస్తారో లేదో.. తెరిచినా థియేటర్స్ దొరుకుతాయో లేదో అని ఆలోచించిన కొందరు మేకర్స్ తమ సినిమాలను డైరెక్ట్ ఓటీటీలలో రెలీజ్ చేస్తున్నారు. ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్స్ లో సినిమాలు విడుదల చేయడం అనేది హాలీవుడ్ లో ఎప్పటి నుంచో ఉన్నదే అయినప్పటికీ మన ఇండస్ట్రీకి మాత్రం ఇది కొత్త అనే చెప్పాలి. ఇక ఇటీవల ప్రభుత్వాలు కొన్ని షరతులతో షూటింగులకు అనుమతివ్వడంతో కొన్ని చిన్న సినిమాలు చిత్రీకరణ స్టార్ట్ చేసాయి.
ఒకప్పుడు సినిమా షూటింగ్ అంటేనే నటీనటులు టెక్నీషియన్స్ సిబ్బంది.. ఇలా సెట్ మొత్తం సందడిగా ఉండేది. కాకపోతే ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవు. కేవలం కొద్దిమంది మాత్రమే సెట్స్ లో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఫ్యూచర్ లో సినిమా షూటింగ్ అంటే సెట్స్ మరియు స్టూడియోస్ పైనే డిపెండ్ అవుతారని అర్థం అవుతోంది. నేచురల్ లొకేషన్స్ లో కాకుండా స్టూడియోలో గ్రీన్ కార్పెట్ మీదే చిత్రీకరణ జరపనున్నారు. ఇక అవుట్ డోర్ షూటింగ్స్ గురించి కొంతకాలం మర్చిపోవాల్సిందే. అవుట్ డోర్ షూట్స్ పెట్టుకొని రిస్క్ తీసుకోవడం కంటే.. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఇండోర్ షూటింగ్స్ చేసుకోవడం మేలనే భావనకు వచ్చేస్తున్నారు.
ఇప్పటికే భారీ బడ్జెట్ సినిమాలన్నీ ఇండోర్ షూటింగ్స్ ప్రాధాన్యత ఇస్తూ సెట్స్ నిర్మాణం స్టార్ట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి - కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న 'ఆచార్య' సినిమా కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో ఓ పురాతన దేవాలయం సెట్ వేస్తున్నారట. కరోనా ప్రభావం తగ్గాక ఈ సెట్ లోనే చిరంజీవి చిత్రీకరణలో పాల్గొంటారని తెలుస్తోంది. ఇక యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ - రాధా కృష్ణ కుమార్ కాంబినేషన్ లో రూపొందుతున్న 'రాధే శ్యామ్' షూటింగ్ కూడా విదేశాలలో చేయాల్సి ఉండగా.. ఇప్పుడు ఇక్కడే సెట్స్ వేసి షూట్ చేయాలని డిసైడ్ అయ్యారట. ఇప్పటికే సెట్స్ నిర్మాణం కూడా స్టార్ట్ అయిందని సమాచారం.
ఇక రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్ 'ఆర్.ఆర్.ఆర్' కూడా ఇండోర్ షూట్ కే ప్రిఫరెన్స్ ఇస్తోందని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ - క్రిష్ కాంబోలో తెరక్కేబోతున్న సినిమా కోసం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో సెట్స్ నిర్మాణం జరుగుతోదని సమాచారం. ఇదంతా చూస్తుంటే ఇంకొన్నాళ్ళు అవుట్ డోర్ లొకేషన్స్ మరియు నేచురల్ లొకేషన్స్ చూడలేమనేది మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. మొత్తం మీద కరోనా మహమ్మారి సినిమా షూటింగ్స్ విషయంలో చేంజెస్ తీసుకొచ్చిందని చెప్పవచ్చు.