Begin typing your search above and press return to search.

అద్భుతమైన కాంబినేషన్ మొదలుకానుంది..

By:  Tupaki Desk   |   13 Oct 2015 8:09 PM IST
అద్భుతమైన కాంబినేషన్ మొదలుకానుంది..
X
కాంబినేషన్ అనగానే స్టార్ హీరో సెన్సేషనల్ డైరెక్టర్ లతో ఈ ఆర్టికల్ నిండిపోతుంది అనుకుని చదువుతుంటే మీకు కాస్త నిరాశే. కానీ అసలు సిసలైన కాంబినేషన్ కి నేడు టాలీవుడ్ నాంది పలికింది. తీసినవి కొద్ది సినిమాలే అయినా ప్రఖ్యాతి గడించిన ఒక డైరెక్టర్, డైరెక్ట్ గా తెలుగులో చేసిన చిత్రాలు అతితక్కువే అయినా తెలుగు ప్రజల గుండెల్లో స్టార్ స్టేటస్ సంపాదించుకున్న హీరో తొలిసారిగా చెయ్యి కలపనున్నారు.

ఐతే - అనుకోకుండా ఒకరోజు - ప్రయాణం - సాహసం సినిమాలతో తెలుగు ప్రేక్షకుల స్థాయిని పెంచిన దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి. కమర్షియల్ గా విజయాన్ని సాధించలేకపోయినా టాలెంట్ గల టెక్నీషియన్ గా పేరుతెచ్చుకున్నాడు. ఇప్పుడు ఈయన దర్శకత్వంలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ తో కలిసి ఒక సినిమా తీయనున్నాడు.

మోహన్ లాల్ డబ్బింగ్ సినిమాల ద్వారా తెలుగు ప్రజల అభిమానాన్ని సంపాదించుకున్నాడు. గాండీవం సినిమాలో ఒక పాటలో మెరిసిన సంగతి తెలిసినదే. ఈ ప్రాజెక్ట్ కి ప్రస్తుత తరం బెస్ట్ టేస్ట్ వున్న నిర్మాతగా పేరు తెచ్చుకున్న సాయి కొర్రపాటి నిర్మాణ బాధ్యతలు స్వీకరించనున్నారు.