Begin typing your search above and press return to search.

క్లైమాక్స్ కన్నీళ్లు పెట్టించడం ఖాయం

By:  Tupaki Desk   |   4 Aug 2016 4:18 AM GMT
క్లైమాక్స్ కన్నీళ్లు పెట్టించడం ఖాయం
X
వైవిధ్యమైన చిత్రాలను తెరకెక్కించడంలో దర్శకుడు చంద్రశేఖర్ యేలేటిది ప్రత్యేక శైలి. అతని సినిమాలన్నీ వేటికవే ప్రముఖ్యతను సంపాదించుకున్నాయి. అనుకోకుండా ఒక రోజు.. ప్రయాణం.. సాహసం ఇలా ప్రతి చిత్రం కూడా వైవిధ్యభరితమైనదే. అలాంటి దర్శకుడి చేతిలో ‘మనమంతా’ అనే ఓ ఫ్యామిలీ ఓమోషన్ వున్న సినిమా తెరకెక్కింది. ఈ చిత్రం ఈనెల 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈసందర్భంగా దర్శకుడు చంద్రశేఖర్ యేలేటీ మాట్లాడారు. తన గత చిత్రాలకూ... ప్రస్తుతం విడుదలవుతున్న ‘మనమంతా’ చిత్రాలకూ గల తేడాలను వివరిస్తూనే.. అనేక చిత్ర విశేషాలను వెల్లడించారు. అవి ఆయన మాటల్లోనే...

‘నేను చేసిన పాత సినిమాలకూ.... ఇప్పుడొస్తున్న ‘మనమంతా’ చిత్రానికి ఏమాత్రం సంబంధం వుండదు. పాత సినిమాలన్నీ థ్రిల్లర్ జోనర్ లోనో లేదా అడ్వంచర్ జోనర్ లోనో చేశా. ఈసారి మాత్రం ఓ హ్యూమన్ ఎమోషన్స్ వున్న సినిమా చేశా. ఒకే సమస్యను.. వేరియజ్ ఏజ్ లో ఓ వ్యక్తి ఎలా ఎదుర్కొన్నాడనేదే మెయిన్ కథాంశం. దాన్ని ఎంతో ఎమోషన్.. విలువలతో చూపించాం. మనం ఏదైనా ఓ సమస్యను స్కూల్ ఏజ్ లో ఓలాగా.. కాలేజీ ఏజ్ లో ఓలాగ.. అదే సంసార జీవితంలోకి అడుగుపెట్టినప్పుడు ఓలాగ.. పిల్లలు పుట్టిన తరువాత ఓలాగ ఎదుర్కొంటాం. దాన్నే ఇందులో కూడా చూపించాం. ఈ సినిమా కథ ఊహించి... మన జీవితంలో ఎక్కడో ఓసారి ఎదురైన క్యారెక్టర్లను దృష్టిలో వుంచుకుని తీశా. ఈ సినిమాను చూసిన ప్రతి ఒక్కరూ ఎమోషన్ గా కనెక్ట్ అవుతారు. అలాగే స్క్రీన్ ప్లే ప్రతి ఒక్కరికీ నచ్చుతుంది. నా గత చిత్రాలన్నింటిలాగే ఈ చిత్రాన్ని ప్రతి ఒక్కరూ చూస్తారని అనుకుంటున్నా’ అన్నారు.

‘నా గత చిత్రాలకు సరిగా ఆదరణ రాలేకపోయినా... ఆ తరువాత కనెక్ట్ అయ్యారు. ఈ సినిమా మాత్రం ఔట్ అండ్ అవుట్ ఆడియన్స్ కచ్చితంగా కనెక్ట్ అవుతారు. నేను చదివిన పుస్తకాలు.. లేదా ఫిక్షన్ అయి వుండొచ్చు.. ఈ సినిమాకు ఇన్ స్పిరేషన్. చిన్నప్పుడే చాలా మంచి అడ్వాన్స్ పుస్తకాలు చదివా. వాటి నుంచే ఈ సినిమా తీయడానికి ప్రేరణ అయి వుండొచ్చు. ఈ సినిమా ప్రతి ఒక్కరూ ఎమోషనల్లీ కనెక్ట్ అవ్వాలంటే... కచ్చితంగా ఆ రోల్ కి మోహన్ లాల్ ఒక్కరే సూట్ అవుతారని అనుకున్నా. ఆయన ఒప్పుకున్న తరువాతే బై లింగ్వల్ అయింది. ఇక గౌతమీ వచ్చి చేరడంతో అది ట్రై లింగ్వల్ అయింది’ అన్నారు.

‘మొదట ఈ సినిమాను తెలుగులో చేద్దాం అనుకున్నా. కానీ మోహన్ లాల్.. గౌతమీ వచ్చి చేరడంతో ఈ చిత్రాన్ని మూడు భాషల్లో తెరకెక్కించాం. నేనే కథ.. స్క్రీన్ ప్లే.. దర్శకత్వం చేసుకోవడం వల్ల నా సినిమాలు లేట్ అవుతున్నాయ్. అంతే తప్ప.. మరే ఇతర కారణాలు లేవు. ఈసారి నేను సినిమా చేయడానికి ఒకటిన్నర ఏడాది పట్టింది. కారణం ఏమిటంటే... మధ్యలో రెండు సినిమాలు ఆగిపోయాయి. అందుకే సినిమాలు చేయడంలో కొంత వెనుకపడిపోయా. నాకూ కమర్షియల్ సినిమాలు చేయాలని వుంది. కానీ అన్నీ అనుకూలించాలి. అప్పుడే అవి కుదురుతాయి. ఈ చిత్రానికి మోహన్ లాలే డబ్బింగ్ చేబుతా అన్నారు. ఎంతో కష్టపడి చెప్పారు. ఆయన వాయిస్ బాగా రిచ్ గా ఉంటుంది. కమల్ హాసన్ లాగే ఆయనకూ ఓ స్లాంగ్ వుంది. అది ఎమోషన్స్ ఎంగేజ్ చేయడానికి ఎంతో ఉపయోగపడింది. ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతుందనే అనుకుంటున్నా’.

‘గౌతమీ ఇందులో అద్బుతంగా నటించేశారు. ఎక్కడా ల్యాగ్ లేకుండా వుంటుంది ఆమె క్యారెక్టర్. ఆమెతో పాటు మిగతా క్యారెక్టర్లు కూడా బాగా చేశారు. ఈ చిత్రంలో ఎమోషన్ ని బాగా కన్వే చేయాలి. అది బాగా కనెక్ట్ అవుతుంది. మ్యూజిక్ బాగుంది. ఈ చిత్రానికి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా చేశారు. వారాహి చలనచిత్రంలో చేయడం అదృష్టం. నాకు అనుకోకుండా ఓ రోజు చిత్రం నుంచే ఈ బ్యానర్లో సినిమా చేయాలనే కమిట్ మెంట్ వుంది. అప్పటి నుంచి ట్రావెల్ అవుతూ వున్నా. ఇప్పటికి కుదిరింది. సాయి కొర్రపాటి నాకు మంచి ఫ్రెండ్. ఈ చిత్రాన్ని చూసిన వెంటనే ప్రేక్షకులు ప్రతి ఒక్కరూ క్లైమాక్స్ చూసి కళ్లలో నీళ్లు పెట్టుకుని బయటకు వస్తారు. ఇందులో నాలుగు కథలు వుంటాయి. ట్విస్టులుంటాయి. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ తమ జీవితాన్ని ఆ క్యారెక్టర్లలో చూసుకుంటారు. తప్పకుండా అందరికీ నచ్చుతుంది’ అన్నారు.