Begin typing your search above and press return to search.

డిఫరెంట్ దర్శకుడితో నాని?

By:  Tupaki Desk   |   5 July 2018 5:53 AM GMT
డిఫరెంట్ దర్శకుడితో నాని?
X
టాలీవుడ్ లో డిఫరెంట్ సినిమాలు చేసే దర్శకులు చాలా తక్కువ మంది ఉన్నారు. అందులో చంద్రశేఖర్ యేలేటి ఒకరు. ప్రతి సినిమాలో ఎదో ఒక కొత్తదనం ఉండేలా చూసుకోవడం ఈ దర్శకుడి మొదటి లక్షణం. సినిమాపై హైప్ చాలా స్లోగా పెరుగుతుంటుంది. క్లిక్ అయితే ఇతను చేసిన సినిమాలు చాలా బాగా ఆడతాయి అని ఇండస్ట్రీలో మంచి టాక్ ఉంది. అయితే కమర్షియల్ బాక్స్ ఆఫీస్ హిట్ అందుకోవడంలో చంద్రశేఖర్ అంతగా సక్సెస్ అవ్వడం లేదు.

దీంతో ఆయన సినిమాలకు కూడా ఈ మధ్య కాలంలో బ్రేక్స్ పడుతున్నాయి. ఒక సినిమా ఎనౌన్స్ మెంట్ చేసే లోపే బ్రేకులు పడుతున్నాయి. ప్రస్తుతం ఆయన నెక్స్ట్ సినిమా ఎవరితో చేస్తారు అనేది పెద్ద సందేహంగానే ఉంది. మొదట్లో సాయి ధరమ్ తేజ్ తో ఒక సినిమా ఉంటుందని వార్తలు బాగా వచ్చాయి. ఇక ఆ తరువాత ఆ కథను గోపిచంద్ కి షిఫ్ట్ అయినట్లు మరో వార్త ఫిల్మ్ నగర్ లో వైరల్ అయ్యింది. ఇక యేలేటి మైత్రీ మేకర్స్ ప్రొడక్షన్ లోనే ఒక సినిమా చేస్తున్నాడు అని ఇటీవల జరిగిన ‘డియర్ కామ్రేడ్’ ప్రారంభోత్సవంలో పాల్గొన్నపుడు క్లారిటీ వచ్చింది.

ఫైనల్ గా నితిన్ తోనే కథని సెట్ చేసుకున్నారు అని ఒక టాక్ కూడా వైరల్ అయ్యింది. అయితే నితిన్ ఆ కథ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఫైనల్ గా నాని తో చంద్రశేఖర్ చర్చలు జరిపినట్లు ఇప్పుడు మరో టాక్ వస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియదు గాని రీసెంట్ గా నాని కథను ఫైనల్ చేసినట్లుగా తెలుస్తోంది. మరి ఈ హీరోతో అయినా ఈ డిఫరెంట్ దర్శకుడు సినిమాను పట్టాలెక్కిస్తాడో లేదో చూడాలి.