Begin typing your search above and press return to search.

సినిమాలు చేయనంటే ఇంకేదో ప్రచారం చేశారు.. సీనియర్‌ నటుడి ఆవేదన

By:  Tupaki Desk   |   25 May 2021 2:30 PM GMT
సినిమాలు చేయనంటే ఇంకేదో ప్రచారం చేశారు.. సీనియర్‌ నటుడి ఆవేదన
X
టాలీవుడ్‌ లో దాదాపుగా 55 ఏళ్లుగా సినిమాలు చేస్తూ 950 సినిమాలకు పైగా చేసిన సీనియర్ నటుడు చంద్రమోహన్ ఇటీవల తన 81వ పుట్టిన రోజు జరుపుకున్నాడు. ఈ సందర్బంగా ఆయన ఆన్ లైన్ ద్వారా కొందరు మీడియా వారితో మాట్లాడుతూ తన గురించిన కొన్ని విషయాలను షేర్ చేసుకున్నాడు. ఆ సమయంలోనే కొన్ని అనారోగ్య సమస్యల వల్ల షూటింగ్ లకు ఇబ్బంది అవుతుంది. గతంలో సినిమాల కోసం ఆరోగ్యంను పట్టించుకోలేదు. అందుకే పలు ఇబ్బందులు ఎదుర్కొన్నాను. అందుకే సినిమాలకు ఇకపై గుడ్ బై చెప్పేయాలనే నిర్ణయానికి వచ్చాను అంటూ చెప్పుకొచ్చాడు.

చంద్రమోహన్‌ సినిమాలకు గుడ్‌ బై చెప్పాడు అంటూ మీడియాలో వార్తలు రెండు రోజులుగా వైరల్ అవుతున్నాయి. ఈ సమయంలోనే కొన్ని సోషల్‌ మీడియా వాల్స్ పై చంద్రమోహన్‌ ఆరోగ్యం విషయంలో పుకార్లు మొదలు అయ్యాయి. ఆయన ఆరోగ్యం ఏమాత్రం సరిగా లేదని.. ఆయన మంచాన పడ్డాడు అంటూ పుకార్లు పుట్టించారు. కొందరు అయితే ఏకంగా చంద్రమోహన్ చనిపోయాడు అంటూ ప్రచారం చేసే ప్రయత్నం చేశారు. కొన్ని గంటల పాటు ఆ సోషల్‌ మీడియా పోస్ట్ లు నెట్టింట తెగ వైరల్‌ అయ్యాయి.

ఆ పోస్ట్‌ లపై చంద్రమోహన్‌ ఆవేదన వ్యక్తం చేశాడు. స్వయంగా ఒక పీఆర్ కు ఫోన్‌ చేసి తాను బాగానే ఉన్నాను.. పూర్తి ఆరోగ్యంతో ఉన్న తనను ఎందుకు చనిపోయాడు అంటూ ప్రచారం చేస్తున్నారో అర్థం కావడం లేదంటూ వ్యాఖ్యలు చేశాడట. తన భార్యతో ఉన్న పొటోను కూడా చంద్రమోహన్‌ షేర్‌ చేశారు. చంద్రమోహన్‌ గురించి వస్తున్న వార్తలను ఖండిస్తూ పలువురు ఇండస్ట్రీకి చెందిన జర్నలిస్టులు మరియు పీఆర్ లు సోషల్‌ మీడియా ద్వారా పోస్టులు పెట్టారు. చంద్రమోహన్‌ గారు పూర్తి ఆరోగ్యంతో ఉన్నారు అనేది వారి పోస్ట్‌ ల సారాంశం.