Begin typing your search above and press return to search.

నాగార్జున హీరోయిన్ యోగా భంగిమ

By:  Tupaki Desk   |   24 Jun 2020 12:45 PM IST
నాగార్జున హీరోయిన్ యోగా భంగిమ
X
`చంద్ర‌లేఖ` సినిమా థియేట‌ర్ల‌లో ఫ్లాపైనా బుల్లితెర‌పై చ‌క్కని టీఆర్పీల‌తో ఆద‌ర‌ణ ద‌క్కించుకుంది. ఆ మూవీలో నాగార్జున స‌ర‌స‌న న‌టించిన ర‌మ్య‌కృష్ణ‌- ఇషా కొప్పిక‌ర్ పెర్ఫామెన్స్ ని అభిమానులు ఎప్ప‌టికీ మ‌ర్చిపోలేరు. అందాల భామ‌లు ఇరువు‌రూ పోటీప‌డి మ‌రీ న‌టించారు. ముఖ్యంగా బాలీవుడ్ బ్యూటీ ఇషా కొప్పిక‌ర్ మతి చెడే న‌ట విన్యాసాలు ర‌క్తి క‌ట్టిస్తాయి. ఈ అమ్మ‌డు ఆ త‌ర్వాత బాలీవుడ్ కే అంకిత‌మైపోవ‌డంతో తెలుగు ఆడియెన్ కి ట్రీట్ క‌రువైంది.

ఇదిగో అప్పుడ‌ప్పుడు ఇలా సోష‌ల్ మీడియా పోస్టుల‌తో ఇషా ట‌చ్ లోకి వ‌స్తోంది మ‌ళ్లీ. సాటి నాయిక‌ల్లానే ఇషా కొప్పిక‌ర్ నిత్యం యోగా ప్రాక్టీస్ పేరుతో వేడెక్కించే ఫోటోల్ని షేర్ చేస్తూ ఇదిగో ఇలా మంట‌లు పెడుతోంది. వైట్ అండ్ వైట్ స్పోర్ట్స్ వేర్ లో అగ్గి రాజేస్తోంది. అలాగే ఈ ఆస‌నం ఎంతో ప్ర‌త్యేక‌మైన‌ది. ఏక ప‌వ‌న ముక్తాస‌నం లో ఇషా సంథింగ్ హాట్ గా క‌నిపిస్తోంద‌న్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.

యోగా మిమ్మల్ని ప్రస్తుత క్షణంలోకి తీసుకువెళుతుంది. జీవితం ఉన్న ఏకైక విద్య ఇది. శరీరం .. మనస్సు రెండింటికీ యోగా ఒక గొప్ప అభ్యాసం. ఇది శాంతి.. సంపూర్ణతను అందిస్తుంది. రోజువారీ ఒత్తిడిని అధిగమించడానికి మీకు సహాయపడుతుంది.. అని తెలిపింది ఇషా. మీ దినచర్యలో యోగాభ్యాసాన్ని చేర్చడానికి ఈ ఇంటర్నేషనల్ యోగాడే సంద‌ర్భంగా ప్రతిజ్ఞ చేయండి!! అంటూ కోరింది. 2019లో క‌న్న‌డ‌లో ఓ చిత్రంలో న‌టించింది. 2020లో ఓ హిందీ చిత్రం.. ఓ త‌మిళ చిత్రంలో న‌టిస్తూ బిజీగా ఉంది. హిందీ చిత్రం అస్సీ న‌బ్బే పూరే సౌ ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ లో ఉండ‌గా .. త‌మిళ చిత్రం అయలాన్ రిలీజ్ కి రెడీ అవుతోంది.