Begin typing your search above and press return to search.

యేలేటి కొత్త సినిమా కబురొచ్చింది

By:  Tupaki Desk   |   12 Aug 2015 1:40 PM GMT
యేలేటి కొత్త సినిమా కబురొచ్చింది
X
రాజమౌళి, త్రివిక్రమ్, పూరి లాంటి స్టార్ డైరెక్టర్ల స్థాయిలో భారీ ఫాలోయింగ్ లేకపోవచ్చు కానీ.. చంద్రశేఖర్ యేలేటికి కూడా డైహార్డ్ ఫ్యాన్స్ ఉన్నారు తెలుగు రాష్ట్రాల్లో. ఆయన సినిమా వస్తోందంటే కళ్లు మూసుకుని సినిమాకు వెళ్లిపోయే అభిమానులు తక్కువేమీ కాదు. ఈ టాలెంటెడ్ డైరెక్టర్ రెగ్యులర్ గా సినిమాలు తీయాలని కోరుకుంటారు ఆయన అభిమానులు. కానీ మనోడు మామూలుగానే కొంచెం స్లో. పైగా కమర్షియల్ సినిమాలకు పేరుబడ్డ టాలీవుడ్ లో ఇలాంటి టాలెంటెడ్ డైరెక్టర్ని ప్రోత్సహించే నిర్మాతలు కూడా తక్కువే. అందుకే యేలేటి సినిమాకు, సినిమాకు మధ్య బాగా గ్యాప్ వచ్చేస్తుంటుుంది. అతడి చివరి సినిమా ‘సాహసం’ విడుదలై రెండేళ్లు దాటిపోయింది. ఇప్పటికీ కొత్త సినిమా మొదలవలేదు.

అభిరుచి ఉన్న నిర్మాతగా పేరు తెచ్చుకున్న సాయి కొర్రపాటికి యేలేటి ఓ సినిమాకు కమిటైన సంగతి తెలిసిందే. ఆ సినిమా సెప్టెంబరులో మొదలవబోతున్నట్లు సమాచారం. సినిమాకు, సినిమాకు పోలిక లేకుండా చూసుకునే యేలేటి.. ఈసారి తనకు అలవాటు లేని జానర్ ట్రై చేస్తున్నాడు. ఓ ఫ్యామిలీ డ్రామాను తెరకెక్కించబోతున్నట్లు సమాచారం. ఐతే ఇందులో అందరూ కొత్తవాళ్లే నటిస్తారట. ప్రస్తుతం ఆడిషన్స్ జరుగుతున్నాయి. ఐతే కొందరు సీనియర్ నటులు ముఖ్య పాత్రలు పోషిస్తారట. ఈ సినిమాను మీడియం బడ్జెట్ లోనే పూర్తి చేయడానికి సాయి ప్లాన్ చేస్తున్నాడు. దీంతో పాటు విక్టరీ వెంకటేష్ కథానాయకుడిగా యేలేటి దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్ సినిమాకు సన్నాహాలు జరుగుతున్నట్లు కూడా ఈ మధ్య వార్తలు వినిపించాయి. కొన్ని రోజుల్లో ఈ ప్రాజెక్టు గురించి కూడా క్లారిటీ రావచ్చు.