Begin typing your search above and press return to search.

చంద్రశేఖర్ ఏలేటి సినిమా పేరేంటంటే..

By:  Tupaki Desk   |   1 Nov 2015 3:30 PM GMT
చంద్రశేఖర్ ఏలేటి సినిమా పేరేంటంటే..
X
చంద్రశేఖర్ ఏలేటి చేసింది తక్కువ సినిమాలే కానీ.. అతడు వేసిన ముద్ర మాత్రం చాలా బలమైంది. కమర్షియల్ డైరెక్టర్లకు ఏ స్థాయిలో ఫాలోయింగ్ ఉందో.. మంచి టేస్టున్న ఆడియన్స్ లో ఏలేటికి కూడా అంతే ఫాలోయింగ్ ఉంది. ఐతే లాంటి సెన్సేషనల్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన అతను అనుకోకుండా ఒక రోజు - ఒక్కడున్నాడు - సాహసం లాంటి సినిమాలతో తనకంటూ ఓ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు.

అతడి సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయంలో మోహన్ లాల్ - గౌతమి - ఇర్ఫాన్ ఖాన్ లాంటి గ్రేట్ ఆర్టిస్టులతో ఓ సెన్సేషనల్ కాంబినేషన్ సెట్ చేసి సినిమా అనౌన్స్ చేశాడు ఏలేటి. వారాహి చలనచిత్రం పతాకంపై సాయి కొర్రపాటి నిర్మించబోతున్న ఈ సినిమాకు టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. ‘మహిమ’ అనే పేరు పెట్టాడు ఏలేటి ఈ సినిమాకు.

ఓ థ్రిల్లింగ్ ఎలిమెంట్ తో మధ్య తరగతి జీవితాల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కించబోతున్నాడట ఏలేటి. కన్నడ వెర్షన్ కోసం మోహన్ లాల్ స్థానంలో శివరాజ్ కుమార్ ను ఎంచుకున్నాడతను. ప్రస్తుతం ప్రి ప్రొడక్షన్ జరుగుతోంది. నవంబరు నెలాఖర్లో సినిమాను మొదలుపెట్టి మూడు నెలల్లో పూర్తి చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. వచ్చే ఏడాది వేసవికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశముంది.