Begin typing your search above and press return to search.

గోల్డెన్‌ గ్లోబ్‌ పురస్కారంపై నాటు నాటు రచయిత చంద్రబోస్‌ కామెంట్స్‌

By:  Tupaki Desk   |   11 Jan 2023 5:37 AM GMT
గోల్డెన్‌ గ్లోబ్‌ పురస్కారంపై నాటు నాటు రచయిత చంద్రబోస్‌ కామెంట్స్‌
X
ఆర్ఆర్ఆర్‌ సినిమాలోని నాటు నాటు పాట ఉత్తమ ఒరిజినల్‌ సాంగ్ కేటగిరీలో గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కించుకోవడం పట్ల దేశ వ్యాప్తంగా సినీ ప్రముఖులు మరియు సినీ ప్రేమికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఆ పాట కోసం వర్క్ చేసిన ప్రతి ఒక్కరి యొక్క ఆనందానికి అవధులు ఉండవు అనడంలో సందేహం లేదు.

అత్యంత అద్భుతమైన సాంగ్ కు అంతే అద్భుతమైన సాహిత్యంను అందించింది చంద్రబోస్‌. ఇప్పటి వరకు ఎన్నో గొప్ప అవార్డులను పురస్కారాలను దక్కించుకున్న చంద్రబోస్ నాటు నాటు సాంగ్ కు గోల్డెన్ గ్లోబ్‌ అవార్డు రావడం పట్ల చాలా సంతోషం వ్యక్తం చేశారు. చాలా ఎమోషనల్‌ గా వ్యాఖ్యలు చేశారు.

చంద్రబోస్ నాటు నాటు కు అవార్డు రావడం పట్ల స్పందిస్తూ... ఈ రోజు నా జీవితంలో మరచిపోలేని మదుర క్షణం. నాటు నాటు సాంగ్‌ విశ్వ వేదికపై విజయాన్ని సొంతం చేసుకుంది. రచయితగా ఎంతో సంతోషంగా ఉంది. ఇన్ని సంవత్సరాల సినీ ప్రస్థానం లో 850 సినిమాల్లో 3600 పాటలకు సాహిత్యాన్ని అందించాను.

మొదటి సాంగ్ నుండి మొన్నటి వాల్తేరు వీరయ్య పాటల వరకు ప్రతి పాటకు కూడా ఒక తపస్సు మాదిరిగా కష్టపడుతాను. ఇన్నాళ్లుగా... ఇన్ని సార్లు తప్పస్సు చేస్తే దేవుడు ఇప్పుడు కరుణించి వరం ఇచ్చినట్లుగా అనిపిస్తుంది. ఈ పాట కోసం పని చేసిన ప్రతి ఒక్కరికి కూడా చంద్రబోస్ శుభాకాంక్షలు తెలియజేశాడు.

నాటు నాటు పాటలోని లిరిక్స్ ఎంతో అద్భుతంగా ఉంటాయి. ఇద్దరు హీరోల యొక్క ఇమేజ్ ను బిల్డ్‌ చేస్తూ సందర్భానుసారంగా సాగే ఆ పాట కోసం నిజంగానే చంద్రబోస్‌ అద్భుతమైన సాహిత్యంను అందించారు. ఆయన సాహిత్యం పాట యొక్క స్థాయి మరింతగా పెంచింది అనడంలో సందేహం లేదు. ఈ అవార్డు లో చంద్రబోస్ క్రెడిట్ కూడా ఖచ్చితంగా ఉంటుంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.