Begin typing your search above and press return to search.

గజనీ టైపు థ్రిల్లర్ లో వరుణ్‌ తేజ్?

By:  Tupaki Desk   |   13 Aug 2016 12:12 PM GMT
గజనీ టైపు థ్రిల్లర్ లో వరుణ్‌ తేజ్?
X
ఇప్పుడు మెగా హీరో వరుణ్‌ తేజ్ మాంచి జోరు మీద ఉన్నాడు. మనోడు వరుసపెట్టి మాంచి మాంచి సినిమాలు సైన్ చేస్తున్నాడు. మొన్నటివరకు ఖాళీగా ఉన్నాకూడా.. బ్యాక్ టు బ్యాక్ శ్రీను వైట్ల 'మిష్టర్'తో పాటు.. శేఖర్ కమ్ముల ''ఫిదా'' సినిమాను కూడా సైన్ చేశాడు. ఇదే కాకుండా ఇప్పుడు మరో కొత్త సినిమాను కూడా మనోడు ఓకె చేసినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం వరుణ్‌ తేజ్ బాన్సువాడలో ఫిదా సినిమా షూటింగులో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా చేస్తున్న వరుణ్‌ కు ఇప్పుడు 'కార్తికేయ' ఫేం దర్శకుడు చందూ మొండేటి ఒక కథను చెప్పాడట. ఈ కథ గజనీ సినిమా తరహాలో సాగుతుందట. హీరోకు 'లెఫ్ట్ హ్యాండ్ ఏలియన్ సిండ్రోమ్' అనే మెడికల్ కండిషన్ ఉండటం.. తద్వారా వచ్చే సమస్యలు.. ఇదే కథ. గతంలో కార్తికేయ సినిమాలో కూడా ఇదే టైపులో జంతువులను హిప్నటైజ్ చేయడం అనే కాన్సెప్టు చూపించాడు చందు. ఇప్పుడు ప్రేమమ్ రీమేక్ చేస్తున్నాడు కాని.. దాని తరువాత మరోసారి తన ఒరిజినల్ కథతో సత్తా చాటాలని చూస్తున్నాడట. అయితే వరుణ్‌ తేజ్ ఈ కథను విన్నంటనే ఓకె చెప్పినట్లు తెలుస్తోంది. ఒక ప్రముఖ అమెరికా బేస్డ్ తెలుగు సినిమాల పంపిణీదారుడు ప్రొడ్యూస్ చేసే ఛాన్సు ఉందట.

ఎవరి సినిమా పనుల్లో వారు బిజీగా ఉండటం వలన.. ఈ సినిమా తాలూకు ఎనౌన్స్మెంట్ కాస్త లేటుగా వచ్చే ఛాన్సుంది. ప్రేమమ్ రిలీజ్ తరువాత బాహుశా ఈ ప్రకటన వెలవడొచ్చేమో. అది సంగతి.