Begin typing your search above and press return to search.
సరికొత్త పాన్ ఇండియా డైరెక్టర్ గా అవతరించాడా..?
By: Tupaki Desk | 3 Sep 2022 12:31 PM GMT'కార్తికేయ' సినిమాతో డైరెక్టర్ గా ఇండస్ట్రీకి పరిచయమైన చందు మొండేటి.. 'ప్రేమమ్' 'సవ్యసాచి' వంటి చిత్రాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. మధ్యలో రెండు సినిమాలకు రచయితగా చేసాడు. ఈ క్రమంలో ఇప్పుడు ''కార్తికేయ 2'' చిత్రంతో జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంటున్నాడు.
ఇటీవల కాలంలో సౌత్ ఇండియన్ సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో విశేష ఆదరణ దక్కించుకుంటున్నాయి. RRR - పుష్ప - KGF2 లాంటి చిత్రాలు సౌత్ సినిమా సత్తా ఏంటో చూపించాయి. అదే సమయంలో అనేక భారీ బడ్జెట్ బాలీవుడ్ చిత్రాలు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ బాక్సాఫీస్ వద్ద విఫలమయ్యాయి.
లేటెస్టుగా 'కార్తికేయ 2' సినిమా నార్త్ ఆడియన్స్ ప్రశంసలతో పాటు మంచి కలక్షన్స్ సాధిస్తోంది. యంగ్ హీరో నిఖిల్ మరియు చందు మొండేటి కాంబినేషన్ లో వచ్చిన ఈ మిస్టికల్ అడ్వెంచర్ థ్రిల్లర్.. హిందీలో అతిపెద్ద విజయాన్ని నమోదు చేసింది.
2014 లో వచ్చిన 'కార్తికేయ' కు సీక్వెల్ గా ''కార్తికేయ 2'' చిత్రాన్ని తెరకెక్కించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ & అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై నిర్మించారు. ఈ చిత్రాన్ని మొదటి రోజు హిందీలో కేవలం 50 స్క్రీన్‌లలో మాత్రమే విడుదలైంది. అయితే సానుకూల మౌత్ టాక్ కారణంగా స్క్రీన్స్ సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది.
'కార్తికేయ 2' ఇప్పటివరకు హిందీలో రూ. 26 కోట్లకు పైగా వసూలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా రూ. 100 కోట్లకు పైగా కలెక్ట్ చేసి భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా గోల్డెన్ రన్ ను కొనసాగిస్తున్నందున, అభిమానులు చందూ మొండేటిని న్యూ పాన్-ఇండియా డైరెక్టర్ గా పేర్కొంటున్నారు.
ఇప్పుడు దర్శకుడు చందు బాలీవుడ్ లో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయాడు. అతని కోసం చాలామంది బాలీవుడ్ నిర్మాతలు క్యూ కడుతున్నట్లు తెలుస్తోంది. దర్శకధీరుడు రాజమౌళి సైతం ఇటీవల ఓ ఇంటర్వ్యూలో 'కార్తికేయ 2' ని ప్రశంసించారు. దీన్ని ప్రతిష్టాత్మక చిత్రాలైన 'బాహుబలి' - KGF2 మరియు 'పుష్ప'తో పోల్చారు. ప్రముఖ దర్శకుడి నుండి అలాంటి ప్రకటన రావడం చందూ మొండేటికి పాన్ ఇండియా గుర్తింపు కంటే ఎక్కువ అని చెప్పాలి.
పాన్ ఇండియాలో కంటెంట్ మాత్రమే వర్కౌట్ అవుతుందని 'కార్తికేయ 2' సినిమాతో మరోసారి స్పష్టమవుతోంది. అమీర్ ఖాన్ - అక్షయ్ కుమార్ లాంటి బాలీవుడ్ స్టార్లు కూడా ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంలో ఫెయిల్ అవుతుంటే.. 'కార్తికేయ 2' భారీ ప్రమోషన్లు లేకపోయినా మంచి హిట్ సాధించింది.
ఈ సక్సెస్ తో దర్శకుడు చందు మొండేటి పాన్ ఇండియా దర్శకుల జాబితాలో చేరాడని సినీ అభిమానులు అభిప్రాయ పడుతున్నారు. మరి చందు రాబోయే రోజుల్లో ఎలాంటి కంటెంట్ తో వస్తాడో.. పాన్ ఇండియా క్రేజ్ ను కాపాడుకునేలా ఎలాంటి సినిమాను రూపొందిస్తారో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.