Begin typing your search above and press return to search.

నా సినిమాలో ఆమె లేదు-చందూ

By:  Tupaki Desk   |   30 Sep 2015 11:30 AM GMT
నా సినిమాలో ఆమె లేదు-చందూ
X
‘కార్తికేయ’తో ఇండస్ట్రీలోకి దూసుకొచ్చిన దర్శక కెరటం చందూ మొండేటి. రెండో ప్రయత్నంలో నాగచైతన్య హీరోగా మలయాళ బ్లాక్ బస్టర్ ‘ప్రేమమ్’ను రీమేక్ చేస్తున్నాడు ఈ టాలెంటెడ్ డైరెక్టర్. ‘మజ్ను’ అనే టైటిల్ తో తెరకెక్కబోతున్న ఈ సినిమాలో చైతూ సరసన ముగ్గురు హీరోయిన్లు నటించబోతుండటం విశేషం. మెయిన్ హీరోయిన్ గా టాలీవుడ్ లక్కీ ఛార్మ్ శ్రుతి హాసన్ నటించబోతున్న సంగతి తెలిసిందే. మలయాళ ఒరిజినల్ లో ఓ కీలక పాత్ర చేసిన అనుపమ పరమేశ్వరన్ అదే రోల్ ను ఇక్కడా చేస్తోంది. ఇక మూడో హీరోయిన్ ఎవరన్నది సస్పెన్స్ గా మారింది.

మిగతా నటీనటులందరూ ఖరారైపోయారు కానీ.. మూడో హీరోయినే ఫిక్స్ కాలేదింకా. ఆ హీరోయిన్ కోసం చందూ వేట సాగిస్తూనే ఉన్నాడు. ఇంతలోనే నిత్య మీనన్ ఈ పాత్ర చేయబోతున్నట్లు వార్తలు వినిపించాయి. చైతూ - నిత్యల మధ్య జోడీ ఎలా ఉంటుందా అని జనాలు ఆలోచనలో ఉండగా తన సినిమాలో నిత్య నటించట్లేదని స్పష్టం చేశాడు చందూ. ‘‘ఈ రూమర్ ఎలా పుట్టిందో ఏమిటో. మేం కనీసం ఆమెను అడగనైనా లేదు. నిత్యను మా సినిమాలో నటింపజేయాలన్న ఆలోచనే మాకు రాలేదు’’ అని క్రిస్టల్ క్లియర్ గా చెప్పేశాడు చందూ. మరి ఈ పాత్రకు చివరికి ఎవరిని ఎంచుకుంటారో చూడాలి. హారిక - హాసిని క్రియేషన్స్ పతాకంపై రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మించబోతున్నాడు. అక్టోబరు నెలలోనే షూటింగ్ మొదలవుతుంది.