Begin typing your search above and press return to search.

బ్రహ్మోత్స‌వంలో యూట్యూబ్ రాణీ?

By:  Tupaki Desk   |   24 Sep 2015 5:25 AM GMT
బ్రహ్మోత్స‌వంలో యూట్యూబ్ రాణీ?
X
యూట్యూబ్ రాణీగా పాపుల‌ర్ అయ్యింది తెలుగమ్మాయ్ చాందిని చౌదరి. లఘుచిత్రాల్లో న‌టించి వాటి ద్వారా యూట్యూబ్ లో పాపులారిటీ పెంచుకుంది. స‌రిగ్గా అదే ఈ అమ్మ‌డికి వెండితెర అవ‌కాశం తెచ్చింది. రీసెంటుగా రిలీజైన కేటుగాడు సినిమాలో క‌థానాయిక‌గా న‌టించింది. ఈ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌ లో పూర్తి స్థాయి రోల్‌ లో క‌నిపించి మిశ్రమ స్పందన తెచ్చకున్న చాందిని ఇప్పుడు ఓ అరుదైన అవ‌కాశాన్ని అందుకుంది.

ఈ భామ శ్రీ‌కాంత్ అడ్డాల ద‌ర్శ‌క‌త్వంలోని బ్ర‌హ్మోత్స‌వంలో క‌నిపించ‌బోతోంది. ఇందులో మ‌హేష్ ఇంట్ర‌డ‌క్ష‌న్ సాంగ్‌ లో అత‌డితో క‌లిసి స్టెప్పు వేయ‌బోతోంది. ఇటీవ‌లే ఈ పాట చిత్రీక‌ర‌ణ రామోజీ ఫిలింసిటీలో పూర్తి చేశారు. మ‌హేష్ అంత‌టి స్టార్ తో క‌లిసి స్టెప్పేస్తోంది అంటే ఓ మెట్టు ఎక్కిన‌ట్టే. బ్ర‌హ్మోత్స‌వంతో చాందిని ఎవ‌రో బైటి ప్ర‌పంచానికి తెలుస్తుంది. అయితే ఈ తెలుగ‌మ్మాయ్ త‌న‌కి తానుగా స‌రైన ప్ర‌మోష‌న్ చేసుకుని రేసులో దూసుకుపోతే మ‌రిన్ని ఛాన్సులొస్తాయి. తెలుగుతో పాటు పొరుగు భాష‌ల్లోనూ ఓ లుక్కేస్తే రేసులోకి వ‌చ్చిన‌ట్టే. క‌లర్స్ స్వాతి - శ్రీ‌దివ్య‌ - హాసిక (ఆనందిని) రేంజుకి ఎదిగేస్తుందేమో చూడాలి.