Begin typing your search above and press return to search.

యూట్యూబ్ హీరోయిన్ కి బంపరాఫర్

By:  Tupaki Desk   |   14 March 2017 12:30 AM GMT
యూట్యూబ్ హీరోయిన్ కి బంపరాఫర్
X
షార్ట్ ఫిలిమ్స్ తో యూట్యూబ్ లో సెన్సేషన్స్ సృష్టించిన బ్యూటీ చాందినీ చౌదరి. ఈ సొగసరికి టాలీవుడ్ నుంచి కూడా మంచి అవకాశాలే వచ్చాయి. మహేష్ బాబు మూవీ బ్రహ్మోత్సవంలో ఓ చిన్న కేరక్టర్ తో ఆకట్టుకున్న ఈమెకు.. కుందనపు బొమ్మ.. కేటుగాడు వంటి సినిమాల్లో అవకాశాలు అయితే వచ్చాయి కానీ.. సిల్వర్ స్క్రీన్ పై బ్రేక్ మాత్రం రాలేదు.

ఇప్పుడీ యూట్యూబ్ స్టార్ కి.. ఓ అద్భుతమైన అవకాశం లభించింది. భలే మంచి రోజు అంటూ ఏడాదిన్నర క్రితం ఓ సినిమా తీసి ఆకట్టుకున్న యంగ్ డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య.. తాజాగా నలుగురు కుర్రాళ్లతో ఓ మల్టీస్టారర్ అనౌన్స్ చేశాడు. నారా రోహిత్.. సందీప్ కిషన్.. ఆది.. సుధీర్ బాబులు ఈ చిత్రంలో నటిస్తుండగా.. శమంతక మణి అంటూ క్యాచీ టైటిల్ ను ఈ మూవీకి పెట్టారు. ఈ మూవీలో.. ఆదికి జోడీగా నటించే అవకాశం చాందినీ చౌదరికి ఇచ్చాడు దర్శకుడు.

నలుగురు కుర్రాళ్లు కలిసి నటిస్తుండడంతో ఈ చిత్రంపై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. ఇప్పుడీ సినిమాలో మిగిలిన హీరోయిన్లను వెతుకుతున్నారు దర్శక నిర్మాతలు. భవ్య క్రియేషన్స్ పతాకంపై రూపొందుతున్న ఈ శమంతకమణి చిత్రాన్ని ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/