Begin typing your search above and press return to search.

ఇంకా బ్రేక్ కోసం వెయిటింగే..

By:  Tupaki Desk   |   31 July 2017 10:00 AM GMT
ఇంకా బ్రేక్ కోసం వెయిటింగే..
X

తెలుగు సినిమాల్లో తెలుగు హీరోయిన్లు తక్కువే. కాని ఉన్న కొద్దిమంది అమ్మాయిలకూ బీభత్సమైన ఛాన్సులు కూడా ఏమీ వచ్చేయట్లేదు. యుట్యూబ్ షార్ట్ ఫిలింస్ తో పాపులర్ అయిన చాందిని చౌదరి కూడా ఇప్పుడు తెలుగులో అదే పంధాలో వస్తున్న హీరోయిన్. మొన్న విడుదలైన శమంతకమణి సినిమాలో ఒక హీరోయిన్ గా చేసిన ఈ అమ్మాయికి పెద్దగా పేరు తెచ్చిపెట్టలేదు. దానితో రాబోతున్న ‘మను’ అనే ఒక థ్రిల్లర్ సినిమా పై ఆశలు పెంచుకుంటుంది.

గౌతమ్ రాజు హీరోగా నటిస్తున్న ఈ సినిమాను ఫణీంద్ర నరిసెట్టి డైరెక్ట్ చేస్తున్నాడు. చాందినితో మధురం అనే షార్ట్ ఫిల్మ్ తీసినతనే ఈ డైరెక్టర్. స్క్రిప్ట్ ఏంటి అని అడగకుండానే ఓకే చెప్పేసాను అంటోందీ అమ్మడు. ఈ సినిమాలో రొమాన్స్ ఉంది సస్పెన్స్ ఉంది కథ ఏమై ఉంటుంది అని పేక్షకులుకు ఒక ఉత్కంఠ ఉంటుంది సినిమా చూసేటప్పుడు అని చెబుతోంది. ఈ కథలో 80వ దశకంలో జరిగే కొన్ని సంఘటనలు ఆదారంగా సీన్లు ఉన్నాయట. పైగా ఈ సినిమాలో చాందిని గెటప్ కూడా ఒక ఇంగ్లిష్ అమ్మాయిలా ఉంటుందట. అటువంటి దుస్తులులలో నన్ను నేను ఎప్పుడు చూసుకోలేదు ఈ సినిమాలో నా పాత్రకు మంచి గుర్తింపు వస్తుంది అనే నమ్మకం ఉన్నాను అంటోందీ సుందరి.

షార్ట్ ఫిల్మ్ ద్వారా వచ్చి వెండి తెరపై మెరుస్తున్న హీరోయిన్లు ఇప్పుడు ఇలా చిన్న సినిమాలులలో అవకాశాలును బాగనే అందిపుచ్చుకుంటున్నారు. కాని వీరిలో ఎవరూ కూడా స్టార్ హీరోయిన్ స్థాయికి చేరుకోలేకపోతున్నారు. మరి చాందిని కి అలాంటి బ్రేక్ వస్తుందని ఆశిద్దాం.