Begin typing your search above and press return to search.

యూట్యూబ్ బేబీ.. ఇలా అయితే ఎలా?

By:  Tupaki Desk   |   20 Sep 2015 7:30 AM GMT
యూట్యూబ్ బేబీ.. ఇలా అయితే ఎలా?
X
యూట్యూబ్‌ లో పాపుల‌ర్ అయ్యి వెండితెర అవ‌కాశాలు ప‌ట్టేయాల‌నుకునే న‌టీన‌టులెంద‌రో. అలా పాపుల‌రై బోలెడ‌న్ని ఛాన్సులు అందుకుంటున్న వాళ్లు ఉన్నారు. ల‌ఘుచిత్రాలు, 1 గంట సినిమాలలో మెస్మ‌రైజింగ్ పెర్ఫామెన్సెస్‌ తో మై మ‌రిపించే న‌టీన‌టులు ఎంద‌రో. అలాంటివాళ్ల‌కు ఔత్సాహిక ద‌ర్శ‌కులు పిలిచి మ‌రీ అవ‌కాశం ఇస్తున్నారు. కాస్త బిజీ అయిపోయేవార‌కూ స్ర్ట‌గుల్‌. త‌ర్వాత అవ‌కాశాలు వెంట‌ప‌డి మ‌రీ వ‌స్తున్నాయి. అలా పెద్ద స్టార్లు అయిన‌వాళ్లెంద‌రో.

టాలీవుడ్‌ లో స్టార్ హీరోయిన్ స్టాట‌స్‌ ని చేరుకుంది రెజీన‌. ఈ అమ్మ‌డు ఓ చెన్న‌య్ చంద్రం. ఆరంభం కొన్ని ల‌ఘుచిత్రాల్లో న‌టించింది. అవ‌న్నీ యూట్యూబ్‌ లో హ‌ల్‌ చ‌ల్ చేశాయి. అలా ఓ ల‌ఘుచిత్రంలో చూసిన త‌ర్వాతే ఎస్‌.ఎం.ఎస్‌ లో ఛాన్సొచ్చింద‌ని చెప్పుకొచ్చింది రెజీన‌. డైరెక్ట‌ర్ ప్ర‌వీణ్ స‌త్తారు త‌న‌కి ఛాన్సిచ్చింది యూట్యూబ్ వీడియో వ‌ల్లేన‌ని చెప్పింది రొటీన్ ల‌వ్ స్టోరీ టైమ్‌ లో. అవును ఇలాంటి వాళ్లెంద‌రో. అప్ప‌ట్లో ఓ యూట్యూబ్ వీడియోతో సంచ‌ల‌నం సృష్టించిన ఓ కాలేజ్ కుర్రాడికి మారుతి అవ‌కాశం ఇచ్చి ఎంక‌రేజ్ చేశాడు. ఇప్పుడు అదే బాప‌తులో ఓ ముద్దుగుమ్మ ఏకంగా హీరోయిన్‌ గా అవ‌కాశం అందుకుంది. ఈవిడ పేరు చాందిని చౌద‌రి. లేటెస్టుగా రిలీజైన కేటుగాడు సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. అయితే చాందిని అప్పియ‌రెన్స్‌ పై ఘాటైన విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. మ‌రీ బొమ్మ‌లా క‌నిపించింది త‌ప్ప ఎక్స్‌ ప్రెష‌న్ లేద‌ని కామెంట్ వినిపించింది.

ఆన్‌ లైన్ లో, యూట్యూబ్‌ లో క‌నిపించి అవ‌కాశం ప‌ట్టేసినా క‌థానాయిక‌గా ఎద‌గాలంటే బోలెడంత నేర్చుకోవాల్సి ఉంది. ఇప్ప‌టికీ రాధికా ఆప్టే లాంటి ఫేమ‌స్ స్టేజీ ఆర్టిస్టు త‌న న‌ట‌న‌ను మెరుగుప‌రుచుకోవ‌డానికి ల‌ఘుచిత్రాల్లో న‌టిస్తూనే ఉంది. అహ‌ల్య రేంజులో ఎక్స్‌ ప్రెష‌న్ కావాలి .. అంటూ చీవాట్లు వేశారు క్రిటిక్స్‌. సినిమాలో త‌న పెర్ఫామెన్స్‌ పై అభిమానులు అవాక్క‌య్యార‌ని చెబుతున్నారు. మ‌రి ఈ అమ్మ‌డు మునుముందు ఎలా షైన్ అవుతుందో చూడాలి.