Begin typing your search above and press return to search.
నిర్మాతతో ఒప్పందం వల్ల లాకైపోయిన బ్యూటీ
By: Tupaki Desk | 27 Nov 2020 8:00 AM ISTఒకసారి కమిటైతే నా మాట నేనే వినను అన్నారో హీరో. ఆయన డైలాగ్ లానే తెలుగమ్మాయి చాందిని చౌదరి ఓ నిర్మాతకు రెండేళ్ల పాటు కాల్షీట్లు ఇచ్చేసి లాక్ అయ్యిందట. ఆ క్రమంలోనే తనకు ఎన్నో మంచి ఆఫర్లు వస్తే ఒప్పందం మీరలేక అంగీకరించలేకపోయానని తన బ్యాడ్ డేస్ గురించి తలచుకుంది.
అయితే ఎన్ని బ్యాడ్ డేస్ ఎదురైనా కానీ ఇప్పుడు మాత్రం గుడ్ డేస్ తన జీవితంలోకి ప్రవేశించాయని సంబరపడుతోంది. ప్రస్తుతం వరుసగా క్రేజీ చిత్రాల్లో నటిస్తున్న ఈ తెలుగమ్మాయి.. కెరీర్ పరంగా ఉత్తమ దశలో ఉన్నానని తాజా ఇంటర్వ్యూలో వెల్లడించింది.
ఇండస్ట్రీలో రకరకాల పోరాటాలు సాగించాక దక్కిన అవకాశమిదని కూడా చాందిని తెలిపింది. ప్రస్తుతం ఈ భామ `కలర్ ఫోటో` అనే మూవీలో నటిస్తోంది. మరికొన్ని ఉత్తమమైన ప్రాజెక్టులకు కమిటైంది.
చాలా ఏళ్ల అనుభవం ఉన్నా కానీ ఎక్కువ సినిమాలు చేయకపోవడానికి కారణమేమిటి? అంటే నిర్మాతతో రెండేళ్ల కాంట్రాక్ట్ అన్న సమాధానం ఇచ్చారు చాందిని. ఇలాంటి పరిణామం వల్లనే పటాస్.. కుమారి 21 ఎఫ్ ఆఫర్లు కోల్పోయిందట.