Begin typing your search above and press return to search.

నాన్ థియేట్రికల్స్ గట్టిగా లాగిన చాణక్య!

By:  Tupaki Desk   |   1 Oct 2019 4:18 PM GMT
నాన్ థియేట్రికల్స్ గట్టిగా లాగిన చాణక్య!
X
టాలీవుడ్లో యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్ గా నిలిచే హీరోలలో మాచో హీరో గోపిచంద్ ఒకరు. గోపిచంద్ కొత్త సినిమా 'చాణక్య' కూడా యాక్షన్ ప్రధానమైన చిత్రమే కానీ ఇదో స్పై థ్రిల్లర్. లవ్.. కామెడీ కూడా లాంటి ఇతర కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా సినిమాలో ఉన్నాయనే విషయం ట్రైలర్ లోనే అర్థం అయింది. 'చాణక్య' మరో నాలుగు రోజుల్లో రిలీజుకు సిద్ధం అవుతోంది. దీంతో ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజెనెస్ లెక్కలపై ఆసక్తి కలగడం సహజం.

తాజా సమాచారం మేరకు ఈ సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్ బిజినెస్ వివరాలు ఇలా ఉన్నాయి. ఈ సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్ భారీగా 15 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయి. ఇందులో హిందీ డబ్బింగ్ రైట్స్ ద్వారా రూ. 9 కోట్లు వచ్చాయి. ఇక 'చాణక్య' శాటిలైట్ రైట్స్ ను ప్రముఖ టీవీ చానెల్ స్టార్ మా వారు రూ. 4 కోట్లకు దక్కించుకున్నారు. ఇవి కాకుండా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను అమెజాన్ ప్రైమ్ వీడియోవారు రూ. 2 కోట్లకు సొంతం చేసుకున్నారు. సో.. టోటల్ 15 కోట్లు. గోపీచంద్ మార్కెట్ ను బట్టి చూస్తే ఇది చాలా మంచి మొత్తమని చెప్పాలి. సినిమాపై ట్రేడ్ వర్గాలలో నెలకొన్న పాజిటివ్ బజ్ కు ఇది నిదర్శనమనుకోవచ్చు.

ఈ సినిమాలో గోపిచంద్ సరసన మెహ్రీన్ నటిస్తోంది. బాలీవుడ్ భామ జరీన్ ఖాన్ మరో కీలక పాత్రలో కనిపిస్తుంది. ఈ చిత్రానికి సంగీతం విశాల్ చంద్రశేఖర్. ఈ సినిమాను ఎకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి దర్శకుడు తిరు. 'చాణక్య' అక్టోబర్ 5 న ప్రేక్షకుల ముందుకు రానుంది.