Begin typing your search above and press return to search.

మెగా ఫ్యామిలీలో ఛామింగ్ హీరో యాడైనట్టే!

By:  Tupaki Desk   |   19 Jun 2020 4:00 AM GMT
మెగా ఫ్యామిలీలో ఛామింగ్ హీరో యాడైనట్టే!
X
మెగా ప్రిన్సెస్ నీహారిక పెళ్లి ప్ర‌స్తుతం ట్రెండీ టాపిక్. అటు మెగాభిమానులు సహా అంద‌రిలోనూ దీనిపై ఒక‌టే ఆస‌క్తి నెల‌కొంది. ఇప్ప‌టికే మెగా అల్లుడి ఫ‌స్ట్ లుక్ రివీలైంది. మెగా ప్రిన్సెస్ సెలెక్ష‌న్ ఎలా ఉందో అత‌డి ఫోటో చూస్తే క్లారిటీ వ‌చ్చేసింది. కుర్రాడు అంద‌గాడు... ఆర‌డుగుల ఆజానుభాహుడు.. అంత‌కుమించి ప‌ర్ఫెక్ట్ ఫిజిక్ తో ఎంతో స్టైలిష్ గా ఉన్నాడు. నీహారిక సెల‌క్ష‌నా మ‌జాకానా? అన్న‌ట్టుగానే ఉంది అత‌డి విగ్ర‌హం.

ఇంత‌కీ మెగా అల్లుడి నామ‌ధేయం.. ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ వివ‌రాలేమిటి? అంటే.. నీహారిక పెళ్లాడ‌బోతున్న వ‌రుడి పేరు చైత‌న్య‌. అత‌డు ఓ హయ్య‌ర్ అఫీషియ‌ల్ కుటుంబానికి చెందిన వాడు అని తెలుస్తోంది. ప్ర‌స్తుతం నీహారిక కాబోయే మామ‌గారు గుంటూరు పోలీస్ శాఖ‌లో ఐజీగా ప‌ని చేస్తున్నారు. చైత‌న్య బిట్స్ పిలానీలో అత్యున్న‌త విద్యాభ్యాసం పూర్తి చేశారు.

ఆగ‌స్టులో నీహారిక‌- చైత‌న్య జంట నిశ్చితార్థం జ‌ర‌గ‌నుంది. 2021లో పెళ్లి ముహూర్తం ఫిక్స్ కానుంద‌ట‌. ఇక చైత‌న్య ఒడ్డు పొడుగు లుక్ చూస్తుంటే మెగా ఫ్యామిలీలో మ‌రో హీరో జాయిన‌యిన‌‌ట్టేన‌ని అర్థ‌మ‌వుతోంది. ఆ కుటుంబంలో ఇప్ప‌టికే డ‌జ‌ను మంది స్టార్లు ఉన్నారు. చిరంజీవి-నాగ‌బాబు- రామ్ చ‌ర‌ణ్ - అల్లు అర్జున్- అల్లు శిరీష్‌- సాయి తేజ్- వ‌రుణ్ తేజ్- నీహారిక‌- క‌ళ్యాణ్ దేవ్- వైష్ణ‌వ్ తేజ్ ఇంత‌మంది స్టార్లు ఉన్నారు. ఇప్పుడు ఈ జాబితాలో చైత‌న్య పేరు కూడా చేరుతుంద‌నే అభిమానులు భావిస్తున్నారు.