Begin typing your search above and press return to search.

అదే లుక్స్ తో.. అదే స్టెప్పులతో..

By:  Tupaki Desk   |   5 Feb 2018 9:53 AM IST
అదే లుక్స్ తో.. అదే స్టెప్పులతో..
X
దాదాపుగా తన ప్రతి సినిమాలోనూ మెగాస్టార్ చిరంజీవి హిట్ సినిమాల్లోని ఒక పాటను రీమిక్స్ చేసి అభిమానులను మెప్పించే అలవాటున్న మెగా హీరో సాయి ధరమ్ తేజ్. తన లేటెస్ట్ మూవీ ఇంటిలిజెంట్ కోసం కొండవీటిదొంగ సినిమాలోని ఛమక్ ఛమక్ ఛాం పట్టుకో పట్టుకో పాటను అభిమానులకు మరోసారి గుర్తు చేస్తున్నాడు.

ఛమక్ ఛమక్ మెలోడియస్ పాట కావడంతో ఇందులో చిరు సింపుల్ స్టెప్పులతోనే అభిమానులను తెగ మెప్పించాడు. విజయశాంతి- చిరంజీవి హిట్ పెయిర్ కావడంతో ఈ పాటకు వాళ్లిద్దరి జంట ప్రత్యేక అట్రాక్షన్ గా నిలిచింది. ఇప్పుడు సాయి ధరమ్ తేజ్ అందాల రాక్షసి లావణ్య త్రిపాఠితో కలిసి స్టెప్పులు కలిపాడు. ఇందులో తేజూ చలాకీగా కనిపించడమే కాదు.. స్టయిలిష్ లుక్స్ తో అబిమానులను కట్టిపడేశాడు. డ్యాన్సుల పరంగా ఇప్పటికే పేరు తెచ్చుకుని ఉండటంతో ఇందులో స్టెప్పులను అవలీలగా చేసేశాడు. దాదాపుగా చిరు మ్యానరిజమ్స్ ను అనుసరిస్తూ అభిమానులను బాగానే అట్రాక్ట్ చేశాడు.

దీనికితోడు ఈ పాట ఫారిన్ లో చిత్రీకరించారు. లొకేషన్స్ చాలా రిచ్ గా ఉండటంతో పాటకు ఓ రకంగా కొత్త ఫీల్ వచ్చింది. ఎటొచ్చీ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఈ పాటలో కొండవీటిదొంగ సినిమా సంగీతాన్ని దాదాపుగా దింపేయంతో అనివార్యంగానే ఆ సినిమాలోని సీన్లన్నీకళ్లముందు కదుల్తూనే ఉంటాయి. కొండవీటిదొంగ సినిమాలోని శుభలేఖ రాసుకున్నా ఎదలో ఎపుడో సాంగ్ ను ఇప్పటికే రామ్ చరణ్ తన నాయక్ సినిమాలో రీమిక్స్ చేశాడు.