Begin typing your search above and press return to search.
ఎన్టీఆర్ కు అదే పెద్ద సవాల్!
By: Tupaki Desk | 25 Dec 2018 11:00 PM ISTసంక్రాంతి రేస్ లో ఫస్ట్ బరిలో దూకుతున్న ఎన్టీఆర్ కథానాయకుడి మీదే అందరి కళ్ళూ ఉన్నాయి. స్వర్గీయ నందమూరి తారకరామారావు బయోపిక్ అనే ఫాక్టర్ బాగా పాజిటివ్ గా జనంలోకి వెళ్తుండగా అసలు సినిమాలో ఎంత లోతుగా ఎన్టీఆర్ జీవితాన్ని చూపించి ఉంటారు అనేదాని మీద అనుమానాలు కూడా ఉన్నాయి. అందులోనూ 12 రీమిక్సు పాటలు 63 గెటప్పులతో ఎన్టీఆర్ పాత సినిమాలలోని బిట్లు అన్ని కలిపితే ఎంత లేదన్నా గంటన్నర పైగా ఉంటుంది. మరి మిగిలిన గంటలో కథ మొత్తం చెప్పేస్తారా అనే సందేహం కలగడం సహజం.
మహానటి కూడా ఇదే తరహలో సాగినప్పటికీ అప్పటి సినిమా తాలుకు రిఫరెన్స్ లు తక్కువగా వాడారు. మిగిలినదంతా ఎమోషనల్ గా ఆవిడ జీవితాన్ని చూపించే ప్రయత్నం చేసారు. అందుకే అది మెప్పు పొందింది. మరి ఎన్టీఆర్ లో అంత డెప్త్ ఉందా అనే సస్పెన్స్ ఇప్పటికిప్పుడు తొలగదు కాని చర్చ మాత్రం ఆగదు. ఎన్టీఆర్ జీవితం నుంచి ప్రేక్షకులు చాలా ఆశిస్తున్నారు. కేవలం రీమిక్సులతో నెట్టేస్తే సరిపోదు.
ఆ మాత్రం వీడియోలు యుట్యూబ్ లో కోకొల్లలుగా ఉన్నాయి. పైగా కేవలం అవే ఉంటె బాలకృష్ణ ఆయన తండ్రి పాటలకు స్టేజి డాన్స్ వేసినట్టు ఉంటుంది తప్ప మరోరకంగా అనిపించదు. మరి క్రిష్ అలా అనిపించకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నాడో చూడాలి. ఎంత బాలకృష్ణ ఉన్నా వట్టి హంగులతో సినిమాలు నడిచే కాలం కాదిది. ఏ మాత్రం తేడా ఉన్నా మొహమాటం లేకుండా ప్రేక్షకులు తిరస్కరిస్తున్నారు. అందుకే ఎన్టీఆర్ విపరీతమైన పోటీ మధ్య ఈ సవాళ్ళన్నీ ఎదురుకోవాల్సి ఉంటుంది.