Begin typing your search above and press return to search.

కానిస్టేబుల్ పై కొత్త సంగతులు చెప్పారు

By:  Tupaki Desk   |   17 Jan 2017 4:21 AM GMT
కానిస్టేబుల్ పై కొత్త సంగతులు చెప్పారు
X
ఆర్ నారాయణ మూర్తి హీరోగా రూపొందిన కానిస్టేబుల్ వెంకట్రామయ్య.. ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పెద్ద సినిమాల మధ్యలో రిలీజ్ కావడంతో.. మొదట అంతగా గుర్తింపు సంపాదించుకులేకపోయిన ఈ మూవీని.. ప్రేక్షకులు ఇప్పుడిప్పుడే పట్టించుకోవడం మొదలుపెట్టారు. జనాల నుంచి రియాక్షన్ గమనించిన కానిస్టేబుల్ వెంకట్రామయ్య యూనిట్.. ప్రమోషన్స్ లో పాల్గొంటూ.. కాసింత బజ్ క్రియేట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

తాజాగా కేరక్టర్ ఆర్టిస్ట్ చలపతిరావు.. ఈ మూవీ గురించి చెబుతూ ఆర్ నారాయణ మూర్తిపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. 'చదలవాడ శ్రీనివాసరావు 40 ఏళ్లుగా నిర్మాతగా ఉన్నా.. తొలిసారిగా ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. అయినా సరే ఎంతో అనుభవం ఉన్న దర్శకుడిగా మమ్మల్ని డీల్ చేశాడు. అందుకే ఆయన కోరుకున్నట్లుగా ఔట్ పుట్ వచ్చింది. ముఖ్యంగా నారాయణ మూర్తిని ప్రెజెంట్ చేసిన తీరు సూపర్ అనాల్సిందే' అంటున్నాడు చలపతి రావు.

'నారాయణ మూర్తి విగ్గు పెట్టి నటించడం ఇదే మొదటి సారి అయుంటుంది. ఇంతకు ముందు ఇలాంటివేమీ ఆయన చేయలేదు. దర్శకుడే బలవంతాన విగ్గు పెట్టి గ్లామర్ గా కనిపించాలని చెప్పాడు. నారాయణ మూర్తికి జయసుధ జంటగా నటించడమే కాదు.. ఈ మూవీలో చాలానే కొత్త పాయింట్లు ఉంటాయి' అంటున్నాడు చలపతిరావు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/