Begin typing your search above and press return to search.
చక్ర మూవీకి చుక్కెదురు.. 'టెన్షన్'లో స్టార్ హీరో!!
By: Tupaki Desk | 17 Feb 2021 9:00 AM ISTసౌత్ ఇండియన్ సినీహీరో విశాల్ చక్ర సినిమా విషయంలో షాకిచ్చింది మద్రాస్ హైకోర్టు. విశాల్ కొత్త సినిమా చక్ర సినిమా విడుదలను నిలిపివేయాలంటూ తీర్పునిచ్చింది. నిజానికి ఈ సినిమా ఫిబ్రవరి 19న విడుదల కావాల్సి ఉంది. అయితే మద్రాస్ హైకోర్టు ఇచ్చిన స్టే సినిమా విడుదల ప్రణాళిక పై ప్రభావం చూపనుంది. వివరాల్లోకి వెళ్తే.. అభిమన్యుడు సినిమా తర్వాత హీరో విశాల్ నుండి వస్తున్న మోస్ట్ ఇంటరెస్టింగ్ మూవీ చక్ర. మధ్యలో యాక్షన్ సినిమా వచ్చినప్పటికి అది బాక్సాఫీస్ వద్ద నిలబడలేకపోయింది. అయితే అభిమన్యుడు బ్యాంకు నేరాల నేపథ్యంలో తెరకెక్కి బాక్సాఫీస్ దగ్గర మంచి హిట్ అందుకుంది. ఎం.ఎస్ ఆనందన్ దర్శకత్వం వహించిన చక్ర సినిమా సైబర్ నేరాలు, ఆన్‌లైన్ మోసాల నేపథ్యంలో రూపొందించబడింది. ఇప్పటికే ట్రైలర్ తో మంచి బజ్ క్రియేట్ చేసిన చక్ర మూవీకి సమస్య ఏర్పడింది. విశాల్ మునుపటి సినిమా యాక్షన్ కొనుగోలుదారులకు నష్టాన్ని కలిగించింది. ఆ కొనుగోలుదారులకు పరిహారం ఇవ్వడానికి విశాల్ చక్రను రూపొందించినట్లు ఇదివరకు తెలిపాడట.
అయితే చక్ర సినిమాకు మొదటి నుండి వివాదాలు ఎదురవుతున్నాయి. ఇటీవలే చక్ర ప్రీరిలీజ్ ఫంక్షన్ కూడా జరిపాడు విశాల్. అలాగే ఈ సినిమా ఫిబ్రవరి 19న ప్రేక్షకుల ముందుకు వస్తుందని విడుదల తేదీ ప్రకటించాడు. తాజాగా తమిళ నిర్మాత రవి ఈ సినిమా కథపై తనకు హక్కులు ఉన్నాయని మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. రెండు వాదనలను పరిశీలించిన తర్వాత మద్రాస్ హైకోర్టు ఈ సినిమా విడుదలకు స్టే విధించింది. అలాగే తదుపరి విచారణను ఫిబ్రవరి 18కి వాయిదా వేసింది. హైకోర్టు తీర్పుతో విశాల్ కాస్త నిరాశకు గురైనట్లు సమాచారం. ఇక ‘చక్ర’ చిత్రంలో విశాల్ ఆర్మీ ఆఫీసర్‌గా నటిస్తుండగా.. శ్రద్ధా శ్రీనాథ్, రెజీనా కీలకపాత్రల్లో నటించారు. ఈ సినిమాను సొంత బ్యానర్ పై విశాల్ నిర్మిస్తున్నాడు. మరి ప్రకటించినట్లుగా ఈ సినిమా 19న విడుదల అవుతుందా లేదా వేచిచూడాలి!