Begin typing your search above and press return to search.

చైతూ 'థాంక్యూ' లేటెస్ట్ అప్డేట్ ఏంటి..??

By:  Tupaki Desk   |   14 April 2022 5:10 AM GMT
చైతూ థాంక్యూ లేటెస్ట్ అప్డేట్ ఏంటి..??
X
యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య గత కొంతకాలంగా వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. 'మజిలీ' 'వెంకీమామ' 'లవ్ స్టోరీ' 'బంగార్రాజు' వంటి బ్యాక్ టూ బ్యాక్ బ్లాక్ బస్టర్స్ అందుకున్నారు. ప్రస్తుతం చైతూ లైనప్ లో ఉన్న క్రేజీ ప్రాజెక్ట్స్ చూసి అక్కినేని అభిమానులు ఖుషీ అవుతున్నారు. కాకపోతే ''థాంక్యూ'' సినిమాకు సంబంధించిన ఎలాంటి అప్డేట్ రాకపోవడం పట్ల నిరాశకు గురవుతున్నారు.

నాగ చైతన్య హీరోగా విక్రమ్ కె కుమార్ దర్శకత్వలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ''థాంక్యూ''. ఇందులో రాశీ ఖన్నా హీరోయిన్ గా నటిస్తుండగా.. మాళవికా నాయర్ - అవికా గోర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు - శిరీష్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హర్షిత్ రెడ్డి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

ఇప్పటికే 'థాంక్యూ' సినిమాకు సంబంధించిన చిత్రీకరణ మొత్తం పూర్తయ్యింది. ఈ విషయాన్ని చిత్ర బృందం ప్రకటించి కూడా రెండు నెలలు గడిచి పోయింది. అయినా సినిమాని ఎప్పుడు విడుదల చేస్తారనే దానిపై క్లారిటీ రావడం లేదు. ఇంతవరకు చైతూ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ మరియు లెజెండరీ సినిమాటోగ్రాఫర్ పీసీ శ్రీరామ్ సోషల్ మీడియాలో షేర్ చేసే ఫోటోలు తప్ప మరో అప్డేట్ లేదు.

సమ్మర్ సీజన్ లో క్రేజీ చిత్రాలన్నీ ఒక్కటొక్కటిగా థియేటర్లలోకి వస్తున్న తరుణంలో.. నాగ చైతన్య 'థ్యాంక్యూ' మూవీ అప్డేట్ కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించి కొన్ని రూమర్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

'థాంక్యూ' సినిమా రా ఫుటేజ్ నుండి చాలా రీషూట్లు జరుగుతున్నాయని.. దాని కోసం నిర్మాతలు బడ్జెట్ సమస్యలను లేవనెత్తుతున్నారని టాక్ వినిపిస్తోంది. ఇక హీరోయిన్ రాశి ఖన్నా కూడా ఈ చిత్రానికి సరైన డేట్స్ కేటాయించడం లేదట. ప్రస్తుతం రాశీ హిందీ ప్రాజెక్ట్స్ పై దృష్టి సారించడమే దీనికి కారణమని అంటున్నారు. ఈ రూమర్స్ లో నిజమెంతో తెలియాల్సి ఉంది.

ఇకపోతే 'థాంక్యూ' నుంచి రెగ్యులర్ గా ఆసక్తికరమైన అప్డేట్స్ రిలీజ్ చేసి, సినిమాపై బజ్ తగ్గకుండా చూడాలని అభిమానులు మేకర్స్ ను రిక్వెస్ట్ చేస్తున్నారు. 'మనం' వంటి క్లాసిక్ తర్వాత నాగచైతన్య - డైరెక్టర్ విక్రమ్ కె కుమార్ కాంబినేషన్ లో రూపొందుతోన్న ఈ మూవీపై మంచి అంచనాలు నెలకొన్నాయి.

ఇప్పటి వరకు లీకైన ఫొటోలలో చైతన్య డిఫరెంట్ లుక్స్ విపరీతంగా ఆకట్టుకున్నాయి. అక్కినేని హీరో కచ్చితంగా మరో సక్సెస్ అందుకుంటారని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ సినిమా చై కు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.

'థాంక్యూ' చిత్రానికి బీవీఎస్ రవి స్టోరీ అందించడంతో పాటుగా సంభాషణలు రాశారు. పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రఫీ నిర్వహించగా.. మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్. థమన్ సంగీతం సమకూరుస్తున్నారు. నేషనల్ అవార్డ్ విన్నర్ నవీన్ నూలి ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు.