Begin typing your search above and press return to search.

చైతు 'థ్యాంక్యూ'ను ఆ రెండు దారుణంగా దెబ్బ‌కొట్టాయా?

By:  Tupaki Desk   |   23 July 2022 9:30 AM GMT
చైతు థ్యాంక్యూను ఆ రెండు దారుణంగా దెబ్బ‌కొట్టాయా?
X
యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య న‌టించిన తాజా చిత్రం 'థ్యాంక్యూ'. ఈ ఫీల్ గుడ్ ఎంట‌ర్టైన‌ర్ కు విక్ర‌మ్ కె. కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యాన‌ర్ పై దిల్ రాజు, శిరీష్ క‌లిసి నిర్మించారు. రాశీ ఖన్నా హీరోయిన్ గా న‌టించ‌గా.. మాళవికా నాయర్, అవికా గోర్, ప్రకాష్ రాజ్, సంపత్, సాయి సుశాంత్ రెడ్డి తదితరులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. మ్యూజిక్ సెన్షేష‌న్ త‌మ‌న్ స్వ‌రాలు అందించాడు.

జూలై 22న ఈ చిత్రం గ్రాండ్ గా విడుద‌లైంది. అభిరామ్ అనే వ్యక్తి లైఫ్ జర్నీ నేప‌థ్యంలో ఈ మూవీ సాగుతుంది. ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా.. మ‌న ఎదుగుద‌ల‌కు కారణమైన వారి పట్ల ఎప్పుడూ కృతజ్ఞతతోనే ఉండాలి అన్న‌ సింగిల్ పాయింట్ తో రూపుదిద్దుకున్న ఈ చిత్రం మిక్స్డ్ రివ్యూల‌ను సొంతం చేసుకుంది. అయితే చైతూకు ఉన్న క్రేజ్ దృష్ట్యా ఈ సినిమా తొలి రోజు బాక్సాఫీస్ వ‌ద్ద మంచి ఓపెనింగ్స్ రాబ‌డుతుంద‌ని భావించారు.

కానీ, అలా జ‌ర‌గ‌లేదు. ఈ మూవీ అనుకున్న రేంజ్ లో క‌లెక్ష‌న్స్ రాబ‌ట్ట‌లేక‌పోయింద‌ని ట్రేడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. చైతు రీసెంట్ గా చేసిన సినిమాల‌న్నీ కూడా బాక్స్ ఆఫీస్ వ‌ద్ద అదిరిపోయే ఓపెనింగ్స్ ని అందుకోవ‌డ‌మే కాదు.. లాంగ్ రన్ లో లాభాలు తెచ్చిపెట్టి సూప‌ర్ హిట్స్ గా నిలిచాయి. అయితే వాటి ఇంపాక్ట్ థ్యాంక్యూపై ఏ మాత్రం ప‌డ‌లేదు.

అస‌లే భారీ వ‌ర్షాలు, లెస్ బజ్ వ‌ల్ల ఆన్ లైన్ బుకింగ్స్‌, ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ సో..సో..గా ఉన్నాయి. దీనికి తోడు ఆంధ్రాలో ఒక‌రోజు ముందే ప్రీమియర్ షోలు వేశారు. ఈ షోలు చూసిన వాళ్లు సోషల్ మీడియా వేదిక‌గా 'థ్యాంక్యూ'లో ఫీల్ మిస్ అయింద‌ని, సినిమా పెద్ద‌గా ఆక‌ట్టుకోలేక‌పోయిందంటూ చ‌ర్చ‌లు మొద‌లు పెట్టారు. ఈ చ‌ర్చ‌లు మార్నింగ్ థియేటర్ కు వెళ్దామనుకున్న వాళ్ళని వెన‌క‌డుగు వేసేలా చేశాయి.

మ‌రోవైపు నైజాంలో టిక్కెట్ రేట్లు తగ్గించకపోవటం ఒక మైనస్ గా మారింది. టిక్కెట్ రేట్లు త‌క్కువ‌గా ఉండి ఉంటే.. ఆన్ లైన్ బుకింగ్స్‌, ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ కాస్త జోరందుకునేవి అన్న టాక్ ఉంది. ఏదేమైనా మేక‌ర్స్ చేసిన ఈ రెండు పొర‌పాట్లు తెలుగు రాష్ట్రాల్లో థ్యాంక్యూ బాక్సాఫీస్ క‌లెక్ష‌న్స్ ను దారుణంగా దెబ్బ కొట్టాయి.

దీంతో ఈ మ‌ధ్య కాలంలో నాగ చైతన్య కెరీర్ లోనే అతి త‌క్కువ ఓపెనింగ్స్ సొంతం చేసుకున్న చిత్రంగా థ్యాంక్యూ నిలిచింద‌ని అంటున్నారు. మ‌రి ముందు ముందు అయినా ఈ మూవీ వ‌సూళ్లు ఊపందుకుంటాయో..లేదో..చూడాలి.