Begin typing your search above and press return to search.

చైతూ అస్సలు ఖాళీగా ఉండట్లేదుగా..!

By:  Tupaki Desk   |   8 July 2021 12:30 PM GMT
చైతూ అస్సలు ఖాళీగా ఉండట్లేదుగా..!
X
అక్కినేని హీరో నాగచైతన్య ఇప్పటికే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్‌ స్టోరీ సినిమాను చేశాడు. ఆ సినిమా చిత్రీకరణ పూర్తి అయ్యి చాలా నెలలు అవుతుంది. కరోనా సెకండ్ వేవ్‌ కారణంగా వాయిదా పడింది. గత ఏడాది ఆరంభం నుండి ఇప్పటి వరకు లవ్‌ స్టోరీని వాయిదా వేస్తూనే వస్తున్నారు. లవ్‌ స్టోరీ అలా ఉండగానే చైతూ మరో సినిమాను మొదలు పెట్టాడు పూర్తి చేయడం కూడా జరిగింది. మనం దర్శకుడు విక్రమ్‌ కుమార్‌ దర్శకత్వంలో థ్యాంక్యూ అనే సినిమాను చేసిన నాగచైతన్య అతి త్వరలోనే మరో సినిమాను చేసేందుకు సిద్దం అయ్యాడు. అందుకు సంబంధించిన స్క్రిప్ట్‌ వర్క్ జరుగుతుంది. ఈ గ్యాప్ లో చైతూ బాలీవుడ్‌ మూవీ లో గెస్ట్‌ రోల్‌ షూటింగ్ లో జాయిన్ అయ్యాడు.

బాలీవుడ్‌ మిస్టర్‌ ఫర్‌ ఫెక్ట్‌ అమీర్ ఖాన్ హీరోగా రూపొందుతున్న లాల్ సింగ్ చద్దా లో నాగచైతన్య కీలక పాత్రలో నటించబోతున్నట్లుగా చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే నాగ చైతన్య లాల్ సింగ్ చద్దా షూటింగ్‌ ను పూర్తి చేయాల్సి ఉంది. కాని కరోనా కారణంగా షూటింగ్ ఆలస్యం అవుతూ వచ్చింది. ఎట్టకేలకు మళ్లీ లాల్‌ సింగ్ చద్దా షూటింగ్‌ పునః ప్రారంభం అయ్యింది. ఆ షూటింగ్ లో చైతూ పాల్గొంటున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం నాగచైతన్య పై లడఖ్‌ లో షూటింగ్‌ చేస్తున్నారు. సినిమాలో అమీర్‌ ఖాన్‌ స్నేహితుడి గా ఆర్మీ ఆఫీసర్ గా నాగచైతన్య కనిపించబోతున్నాడు.

షూటింగ్‌ ను 20 రోజుల్లో పూర్తి చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. నాగచైతన్య నటిస్తున్న మొదటి బాలీవుడ్‌ ప్రాజెక్ట్‌ అవ్వడం వల్ల అందరి దృష్టి ఈ సినిమా పై ఉంది. హాలీవుడ్‌ లో సూపర్‌ సక్సెస్ అయిన ఫారెస్ట్‌ గంప్ కు రీమేక్‌ గా ఈ సినిమా రూపొందుతుంది. అమీర్‌ ఖాన్ ఈ సినిమా కోసం ప్రత్యేక లుక్‌ కు వచ్చాడు. గత మూడు సంవత్సరాలుగా అమీర్ ఖాన్‌ అభిమానులను ఈ సినిమా ఊరిస్తుంది. మోస్ట్‌ వాంటెడ్‌ మోస్ట్‌ అవైటెడ్‌ మూవీగా పేరు దక్కించుకున్న లాల్‌ సింగ్ చద్దా సినిమా లో నాగచైతన్య నటిస్తున్న కారణంగా బాలీవుడ్‌ లో మొదటి సినిమాతోనే చైతూకు మంచి పేరు వస్తుందని అభిమానులు ఆశ పడుతున్నారు.

త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేలా ప్లాన్‌ చేస్తున్నారు. అమీర్‌ ఖాన్ మరియు చైతూల కాంబో సీన్స్‌ ఉంటాయా.. ఉంటే ఎలా ఉంటాయి అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అక్కినేని నాగార్జున ఇప్పటికే బాలీవుడ్‌ లో నటించాడు. కాని స్టార్‌ డమ్‌ దక్కించుకోలేక పోయాడు. కాని చైతూ మాత్రం మొదటి బాలీవుడ్‌ సినిమాతోనే సక్సెస్ దక్కించుకుంటాడనే నమ్మకంను అక్కినేని ఫ్యాన్స్ వ్యక్తం చేస్తున్నారు.