Begin typing your search above and press return to search.

చైతూ ఫ‌స్ట్‌ బైలింగ్వ‌ల్ అనౌన్స్‌మెంట్‌ వ‌చ్చేసింది

By:  Tupaki Desk   |   6 April 2022 5:49 AM GMT
చైతూ ఫ‌స్ట్‌ బైలింగ్వ‌ల్ అనౌన్స్‌మెంట్‌ వ‌చ్చేసింది
X
టాలీవుడ్ హీరోలు గ‌తంతో పోలిస్తే స్పీడు పెంచేశారు. ఒక సినిమా లైన్ లో వుండ‌గానే బ్యాక్ టు బ్యాక్ సినిమాల‌ని ట్రాక్ లో పెట్టేస్తున్నారు. చిరంజీవి నుంచి చిన్న హీరో వ‌ర‌కు ఇప్ప‌డు నాలుగైదు చిత్రాల్లో న‌టిస్తూ షాకిస్తున్నారు. యంగ్ హీరో, అక్కినేని వార‌బ్బాయి నాగ‌చైత‌న్య కూడా ఈ జాబితాలో చేరిపోయాడు. 'మ‌జిలీ' చిత్రంతో మ‌ళ్లీ ట్రాక్ లోకి వ‌చ్చిన నాగ‌చైత‌న్య రీసెంట్ గా ల‌వ్ స్టోరీ, బంగార్రాజు చిత్రాల‌తో బ్యాక్ టు బ్యాక్ సూప‌ర్ హిట్ ల‌ని సొంతం చేసుకున్నారు.

ఇదే జోష్ తో వ‌రుస చిత్రాల్లో న‌టిస్తున్నారు. ఇదే ఏడాది బాలీవుడ్ మిస్ట‌ర్ ప‌ర్ ఫెక్ట్ అమీర్ ఖాన్ న‌టిస్తున్న 'లాల్ సింగ్ చ‌ద్దా' చిత్రంతో బాలీవుడ్ కు వెళుతున్న నాగ‌చైత‌న్య మ‌రో ప‌క్క తెలుగులో 'మ‌నం' ఫేమ్ విక్ర‌మ్ కె. కుమార్ డైరెక్ష‌న్ లో రూపొందుతున్న 'థాంక్యూ' చిత్రంలో న‌టిస్తున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ మూవీ చిత్రీక‌ర‌ణ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటోంది. రాశీఖ‌న్నా, అవికా గోర్ హీరోయిన్ లుగా న‌టించిన ఈ మూవీ త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది.

ఇదే స‌మ‌యంలో విక్ర‌మ్ కె. కుమార్ తో తొలి వెబ్ సిరీస్ 'దూత‌'లో న‌టిస్తున్నారు నాగ‌చైత‌న్య ఓ ప‌క్క వెబ్ సిరీస్ లో న‌టిస్తూనే తాజాగా మ‌రో సినిమాకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. చైతూ 22వ చిత్రంగా తెర‌పైకి రానున్న ఈ మూవీని తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఏక కాలంలో బై లింగ్వ‌ల్ గా తెర‌కెక్కించ‌బోతున్నారు. చైతూ న‌టిస్తున్న తొలి త‌మిళ చిత్ర‌మిది.

విభిన్న చిత్రాల ద‌ర్శ‌కుడిగా పేరు తెచ్చుకున్న వెంక‌ట్ ప్ర‌భు ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ప్ర‌స్తుతం తెలుగులో క్రేజీ చిత్రాల‌ని నిర్మిస్తున్న స్టార్ ప్రొడ్యూస‌ర్‌ శ్రీ‌నివాస చిట్టూరి శ్రీ‌నివాస సిల్వ‌ర్ స్క్రీన్స్ బ్యాన‌ర్ పై ఈ మూవీని నిర్మించ‌నున్నారు.

బుధ‌వారం మేక‌ర్స్ ఈ ప్రాజెక్ట్ ని అధికారికంగా ప్ర‌క‌టించారు. రీసెంట్ గా శింబు హీరోగా న‌టించిన 'మానాడు' చిత్రంతో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ని సొంతం చేసుకున్న వెంక‌ట్ ప్ర‌భు తొలి సారి తెలుగులో చేస్తున్న చిత్ర‌మిది కావ‌డంతో ఈ చిత్రంపై అంచ‌నాలు నెల‌కొన్నాయి. వెంక‌ట్ ప్ర‌భు సినిమా అంటే టెక్నిక‌ల్ గా, స్టోరీ ప‌రంగా చాలా ప్ర‌త్యేక‌త వుంటుద‌న్న‌ది అందిరికి తెలిసిందే. అందుకు అనుగునంగానే ఈ చిత్రానికి టాప్ మోస్ట్ టెక్నీషియ‌న్స్ వ‌ర్క్ చేయ‌బోతున్నారు.

ప‌క్కా క‌మ‌ర్శియ‌ల్ ఎంట‌ర్ టైన‌ర్ గా రూపొంద‌నున్న ఈ చిత్రంలో పాపుల‌ర్ న‌టీన‌టులు న‌టించ‌నున్నారు. వారికి సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు త్వ‌ర‌లోనే తెలియ‌నున్నాయి. ఒకే సారి రెండు భాష‌ల్లోనూ తెర‌కెక్క‌నున్న ఈ చిత్రాన్ని అత్యంత భారీ స్థాయిలో నిర్మించాల‌ని నిర్మాత శ్రీ‌నివాస చిట్టూరి ప్లాన్ చేస్తున్నారు. ప్ర‌స్తుతం ఈయ‌న ఉస్తాద్ రామ్ హీరోగా ఎన్‌. లింగుసామి డైరెక్ష‌న్ లో హై వోల్టేజ్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ 'ది వారియ‌ర్‌' ని నిర్మిస్తున్నారు. ఈ మూవీ జూలై 14న వ‌ర‌ల్డ్ వైడ్ గా భారీ స్థాయిలో విడుద‌ల కానుంది.