Begin typing your search above and press return to search.

చైతూ క్రేజీ లైన‌ప్‌.. ఆరు నెల్లో మూడు రిలీజ్ లు

By:  Tupaki Desk   |   31 May 2022 10:33 AM GMT
చైతూ క్రేజీ లైన‌ప్‌.. ఆరు నెల్లో మూడు రిలీజ్ లు
X
ఇండ‌స్ట్రీ వున్న స్టార్ హీరోలు, మినిమ‌మ్ గ్యారెంటీ స్టార్స్, క్రేజీ స్టార్స్ ఇప్ప‌డు వ‌రుస ప్రాజెక్ట్ ల‌తో బిజీగా వున్నారు. ఒక్కో హీరో రెండు లేదా మూడు ప్రాజెక్ట్ ల‌లో న‌టిస్తూ క్ష‌ణం తీరిక లేకుండా గ‌డిపేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి నుంచి యంగ్ హీరో కిర‌ణ్ అబ్బ‌వ‌రం వ‌ర‌కు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తునం్నారు.

ఒక్కో హీరో చేతిలో మూడు నుంచి నాలుగు సినిమాలున్నాయి. ఇదే త‌ర‌హాలో అక్కినేనివార‌బ్బాయి అక్కినేని నాగ‌చైత‌న్య కూడా వ‌రుస ప్రాజెక్ట్ ల‌తో క్రేజీ లైన‌ప్ తో దూసుకుపోతున్నాడు.

ఈ ఏడాది ప్రారంభం లోనే తండ్రి నాగార్జుతో క‌లిసి 'బంగార్రాజు' మూవీతో హ‌ల్ చ‌ల్ చేసిన నాగ‌చైత‌న్య భారీ విజ‌యాన్ని అయితే సొంతం చేసుకోలేక‌పోయినా ఫ‌ర‌వాలేద‌నిపించే స‌క్సెస్ ని ద‌క్కించుకుని శుభారంభాన్ని అందుకున్నాడు. అయితే ఈ ఏడాది ఆరు నెల‌ల వ్య‌వ‌ధిలో బ్యాక్ టు బ్యాక్ మూడు ప్రాజెక్ట్ ల‌తో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడు. రెండు సినిమాలు, ఓ వెబ్ సిరీస్ తో త‌న స‌త్తా చాటుకోబోతున్నాడు.

నాగ‌చైత‌న్య హీరోగా న‌టిస్తున్న మూవీ 'థాంక్యూ'. 'మ‌నం' ఫేమ్ విక్ర‌మ్ కె. కుమార్ ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నారు. రాశీఖ‌న్నా, అవికా గోర్ హీరోయిన్ లుగా న‌టిస్తున్నారు. శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై ఈ మూవీని స్టార్ ప్రొడ్యూస‌ర్ దిల్ రాజు నిర్మిస్తున్నారు. చిత్రీక‌ర‌ణ పూర్తి చేసుకున్న ఈమూవీ జూలై 8న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ఇందులో మ‌హేష్ బాబు హార్డ్ కోర్ ఫ్యాన్ గా నాగ‌చైత‌న్య క‌నిపించ‌బోతున్నారు.

ఈ మూవీ త‌రువాత బాలీవుడ్ క్రేజీ మూవీ 'లాల్ సింగ్ చ‌ద్దా' రిలీజ్ కాబోతోంది. బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ హీరోగా న‌టించిన ఈ మూవీని హాలీవుడ్ పాపుల‌ర్ ఫిల్మ్ 'ది ఫారెస్ట్ గంప్‌' ఆధారంగా తెర‌కెక్కించారు. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటున్న ఈ మూవీ ఆగ‌స్టు 11న వ‌ర‌ల్డ్ వైడ్ గా ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ఇటీవ‌లే ఈ మూవీ ట్రైల‌ర్ ని విడుద‌ల చేశారు. చై న‌టిస్తున్న తొలి బాలీవుడ్ ఫిల్మ్ ఇది.

ఇక ఇదే ఏడాది నాగ‌చైత‌న్య వెబ్ సిరీస్ తో డిజిట‌ల్ వ‌రల్డ్ లోకి ప్ర‌వేశిస్తున్నారు. 'మ‌నం' ఫేమ్ విక్ర‌మ్ కె. కుమార్ అమెజాన్ ప్రైమ్ కోసం డైరెక్ట్ చేస్తున్న 'దూత‌' వెబ్ సిరీస్ లో న‌టిస్తున్నారు. 10 భాగాలుగా ఈ వెబ్ సిరీస్ త్వ‌ర‌లోనే అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది. ఇలా ఆరు నెల‌ల కాలంలో బ్యాక్ టు బ్యాక్ మూడు రిలీజ్ ల‌తో నాగ‌చైత‌న్య ఆక‌ట్టుకోబోతున్నాడు. వీటీ త‌రువాతే వెంక‌ట్ ప్ర‌భుతో చేయ‌నున్న బై లింగ్వ‌ల్ ప్రాజెక్ట్ థియేర్ల‌లోకి రానుంది.