Begin typing your search above and press return to search.

క్యాన్సిల్ కాదు.. వాయిదా వేసుకున్నారంతే!

By:  Tupaki Desk   |   17 April 2020 11:40 AM IST
క్యాన్సిల్ కాదు.. వాయిదా వేసుకున్నారంతే!
X
యువ సామ్రాట్ అక్కినేని నాగ‌చైత‌న్య - `గీత గోవిందం` ఫేం ప‌ర‌శురాం కాంబినేష‌న్ మూవీ ఉన్న‌ట్టా లేన‌ట్టా? ఇన్నాళ్లుగా ఇది స‌స్పెన్స్. చైతూ మ‌న‌స్ఫూర్తిగానే ప‌ర‌శుర‌మ్ తో ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చినా అటువైపు నుంచే తేడా కొట్టింద‌న్న గుస‌గుస‌లు వినిపించాయి. అనూహ్యంగా సూప‌ర్ స్టార్ మ‌హేష్ నుంచి పిలుపు రావ‌డంతో ప‌ర‌శురామ్ అటువైపు మొగ్గు చూపాడు. దీంతో చైతూతో త‌న‌ ప్రాజెక్ట్ కి తాత్క‌లికంగా బ్రేక్ ప‌డింది. ఇక చైతూ ఇత‌ర క‌మిట్ మెంట్ల‌తో బిజీ అయి పోవ‌డంతో ప‌ర‌శురామ్ తో సినిమా క్యాన్సిల్ అయిన‌ట్లేన‌ని సోష‌ల్ మీడియాలో జోరుగా ప్ర‌చారం సాగింది. క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో `ల‌వ్ స్టోరీ` ఈపాటికే రిలీజ్ కావాల్సిన‌ది. క‌రోనా లాక్ డౌన్ వ‌ల్ల రిలీజ్ వాయిదా ప‌డింది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ పనులు పూర్తి చేసి స‌మ్మ‌ర్ కానుక‌గా రిలీజ్ చేయాల‌నుకున్నా కుద‌ర‌లేదు.

తాజా క్లిష్ఠ‌ ప‌రిస్థితుల నేప‌థ్యంలో ఇప్ప‌ట్లో సినిమా రిలీజ్ కావ‌డం క‌ష్టమే. అయితే చైతూ మాత్రం క‌మిట్‌మెంట్ల విష‌యంలో ఏమాత్రం త‌గ్గ‌డం లేదు. లాక్ డౌన్ పూర్త‌వ్వ‌గానే నందిని రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో చిత్రాన్ని ప‌ట్టాలెక్కించ‌నున్నాడు. దీంతో ఏడెనిమిది నెల‌లు బిజీ బిజీ. ఇదే స‌మ‌యంలో ప‌ర‌శురాం మ‌హేష్ 27వ చిత్రాన్ని పూర్తి చేయ‌నున్నాడు. ఆ ర‌కంగా చై ప‌ర‌శురాం ప్రాజెక్ట్ ను చైతూ మిస్ అవ్వ‌లేద‌ని తాజా స‌మాచారం. సెట్స్ కెళ్లేవి పూర్త‌యిన త‌ర్వాత చై-ప‌రుశురాం జోడీ త‌మ మూవీని ప‌ట్టాలెక్కించే ఆలోచ‌న చేస్తున్నార‌ని ఇన్ సైడ్ టాక్ వినిపిస్తోంది.

ప‌ర‌శురాంకి చై ట‌చ్ లో ఉంటున్నాడని... స్క్రిప్టు ప‌నులు సాగుతున్నాయ‌ని టాక్ వినిపిస్తోంది. చై ఇమేజ్ కు త‌గ్గట్టే ప‌ర్ఫెక్ట్ ల‌వ్ స్టోరీ ప్లాన్ చేస్తున్నార‌ని తొలి నుంచి వినిపిస్తూనే ఉంది. పైగా ప‌ర‌శురాం బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకుని కేర్ ఫుల్ గా స్క్రిప్టు ప‌నిమీదున్నాడు. కార‌ణం ఏదైనా గీత గోవిందం ద‌ర్శ‌కుడిని చైతూ వెంటాడుతూనే ఉన్నాడ‌న్న గుస‌గుసా వేడెక్కిస్తోంది.